Jordar Varthalu: ఆర్టీసీ డ్రైవర్ కి ఝలక్ ఇచ్చిన బైకర్

Jordar Varthalu: హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన ఆర్టీసీ డ్రైవర్‌కు ఒక బైకర్ బుద్ధి చెప్పిన వీడియో వైరల్‌గా మారింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 Jun 2026 7:11 AM IST
Jordar Varthalu
X

Jordar Varthalu: ఆర్టీసీ డ్రైవర్ కి ఝలక్ ఇచ్చిన బైకర్

Jordar Varthalu: ఓశ్నీ.. పర్షాన్ సల్లగుండా.. ట్రాఫిక్ రూల్స్ మాకు కాదనట్టే చేస్తున్నరు కదా కొందరు సర్కారు ఉద్యోగులు. గీనే రుబాబు సూడుర్రి ఎట్లున్నదో. నలుగురు నడ్షిన తోవ్వల నేను నడవను అన్నట్టే జెస్తున్నాడు గదా. సిగ్నల్ కాడ అన్ని బండ్లు ఆగుతే, నేనొక్కణ్ణే పోత అన్నట్టే రాంగు రూట్ల బైలెల్లిండు డ్రైవరన్న. ఇంత కథ జేస్తావా అని బస్సుకు అడ్డం తిర్గిండు బండన్న. మేము ఎటు పోవాలే అన్నట్టు అడ్డం తిరుగుతే కింద మీదయిండు.

అసుంట అచ్చినోళ్లు సుతం అడ్డం తీర్గిర్రు. పట్నం దిక్కు ట్రాఫిక్ల కానొచ్చింది ఈ సీను. ఇగ దినాం ఎన్నో ఓ కాడ సర్కారోళ్లు ట్రాఫిక్ రూల్స్ బ్రేకింగ్ చేస్తున్నది సూస్తుంటే.. ఈళ్ళకు లైసెన్స్ ఎట్లచ్చిందని డౌటు కొడుతున్నది. లైసెన్సులు అమ్మకానికి పెట్టినంతకాలం మనకు ఈ తిప్పలు తప్పయని అంటున్నరు దినం ట్రాఫిక్ల ఇసొంటోల్లు జెయ్యంగ తిప్పలు వడ్తున్న జనాలు. కనీ., రూల్స్ ను తూచా తప్పకుంట పాటించాల్సిన ఆర్టీసీ బస్సు డ్రైవర్లు సుతం గిట్ల రూల్స్ తప్పి డ్రైవింగ్ జేస్తే ఇగ కామన్ జనాల పరిస్థితి ఏంది జెప్పుర్రి.




హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story