Jordar Varthalu: హైదరాబాద్ పెట్రోల్ బంకులో భారీ మోసం
Jordar Varthalu: తెలంగాణ బీజేపీలో కీలక నేత ఈటల రాజేందర్ ఒంటరవుతున్నారా? పార్టీ లోపల జరుగుతున్న రాజకీయాలేంటి? ఈటలను టార్గెట్ చేస్తున్న ఆ అదృశ్య శక్తులు ఎవరు?
Jordar Varthalu: హైదరాబాద్ పెట్రోల్ బంకులో భారీ మోసం
Jordar Varthalu: రసీదు సూత్తార్రు గదా. ఆ.. ఏమున్నదండ్ల అంటరా. పెద్ద ఇలకత మఫిలియానే ఉన్నదుల్లో ఈ రసీదు ఎన్క. కార్ల పట్టే పెట్రోల్ కెపాసిటీ 27 లీటర్లయితే.. 29 లీటర్లకు మీదనే పెట్రోల్ పోశినట్టు రసీదిచ్చిర్రు బంకుల పన్జేశే పనివంతులు. ముచ్చటేందో కారు ఓనరు గీ అన్న శెప్తడున్న ఇనుర్రి. కారు పెట్రోల్ కెపాసిటీ 27 లీటర్లయితె మొదాలు 28 లీటర్లు కొట్టిర్రట. ఇంకో లీటరు ఏడ పోశినట్టో మరి. అప్పటికే కారుల రొండు మూడు లీటర్ల పెట్రోల్ ఉండెనట.. అందుకే అన్నకు డౌటొచ్చి మల్ల పెట్రోల్ కొట్టుమని అడుగుతె మల్లో లీటరు మీదనే కొట్టిర్రు.
పుష్పకవిమానంల ఎంతమంది కూసున్న మల్లొక్కలకు జాగుంటది తెల్సు గనుల్ల.. గీ పెట్రోల్ బంకొల్లు వంద లీటర్ల పెట్రోల్ పొయ్యిమన్నా పోశెతట్టున్నరు గదా 27 లీటర్ల కెపాసిటీ ఉన్న గీ కార్ల. ఇదేందని అడుగుతె పోలీసు కేసు పెట్టుకొమ్మని ఉచిత సలహా గుడ ఇచ్చిర్రట అన్నకు. అంతేగాదు, మా బంకుల గాదు.. నీ కార్లనే ఏదో తక్లీబున్నని ఉల్టా మాట్లాడిర్రట. అంటే మరి కారేమన్న పెట్రోల్ తాగుతాందో ఎట్లనో మరి. హయత్ నగర్లున్న ఓ హెచ్పీ పెట్రోల్ బంకుల బైటవడ్డ ఉద్ధార్కం గిది. పెట్రోల్ బంకుల్లో శెయ్యంగ కస్టరమర్ అవాక్కయ్యిండు గని, బంకుల్లకు గింతగుడ జంకలేదు గదా.. కేసు పెట్టుకొమ్మనేదాక అచ్చిందంటే సూడుర్రి ఎంతకు తెగించున్నరో. ఆఖర్కు గీ అన్న పోలీస్లు శెప్తె పోలీసులచ్చి కేసు రాస్కోని దర్యాప్తు జేస్తున్నరట గని, మరి పెట్రోల్ బంకొల్ల మీద ఏం చర్యలు తీస్కుంటరో సూడాలె ఇగ.




