Big Debate: 40 ఏళ్ల నాటి ఇళ్లకు 22A ఉచ్చు.. స్తంభించిన రిజిస్ట్రేషన్లు: 'బిగ్ డిబేట్'లో బిల్డర్ శ్రీనివాసరావు!
Big Debate: తెలంగాణలో 22A నిబంధనల వల్ల పాత కాలనీల్లోనూ రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయని, రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతింటోందని హెచ్‌ఎమ్‌టీవీ బిగ్ డిబేట్‌లో బిల్డర్ శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు.
Big Debate: 40 ఏళ్ల నాటి ఇళ్లకు 22A ఉచ్చు.. స్తంభించిన రిజిస్ట్రేషన్లు: 'బిగ్ డిబేట్'లో బిల్డర్ శ్రీనివాసరావు!
Big Debate: తెలంగాణలో సెక్షన్ 22A (నిషేధిత భూముల జాబితా) నిబంధనల అమలు తీవ్ర కలకలం రేపుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రైవేట్ భూములు, దశాబ్దాల క్రితం వెలసిన లేఅవుట్లు, నివాస గృహాలను కూడా 22A పరిధిలోకి తీసుకురావడం వల్ల సామాన్య ప్రజలు, బిల్డర్లు తీవ్ర అవస్థలు పడుతున్నారని ‘బిల్డర్ శ్రీనివాసరావు’ ఆందోళన వ్యక్తం చేశారు. hmtv బిగ్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, క్షేత్రస్థాయిలో ఉన్న అసలు సమస్యలను వివరించారు.
"ప్రభుత్వ భూములు, అసైన్డ్, వక్ఫ్, ఎండోమెంట్ ఆస్తులను కాపాడేందుకు 22A ఉందనేది అందరికీ తెలుసు. కానీ గత ఏడాది జనవరి నుంచి హైదరాబాద్‌లోని వసంత నగర్, ఎల్బీనగర్, ఉప్పల్ వంటి అనేక ప్రాంతాల్లో 30-40 ఏళ్ల నాటి ఇళ్లకు, అనుమతులు ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు" అని శ్రీనివాసరావు తెలిపారు.




