Jordar Varthalu: 30 ఎకరాలకు 30 లక్షలు డిమాండ్ చేసి, అడ్డంగా దొరికి
Jordar Varthalu: మేడ్చల్ మల్కాజగిరి జిల్లా శామీర్‌పేట ఎమ్మార్వో సుచరిత ఏసీబీకి దొరికిపోయారు.
Jordar Varthalu: 30 ఎకరాలకు 30 లక్షలు డిమాండ్ చేసి, అడ్డంగా దొరికి
Jordar Varthalu: అర్రర్రె మేడంకు పెద్ద కష్టమే అచ్చింది గద పాడై. చేశ్న పనికి జీతంతోని పాటుగ సేవకు తగ్గ ప్రతిఫలం తీస్కుందామని సూస్తే.. ఏసీబోల్లు పగవట్టినట్టే జేశిర్రు. ఈ మేడం పేరు సుచరిత. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా షామీర్ పేట మండలం తహశీల్దార్గ కొల్వు ఎల్గవెడ్తున్నది. అస్సల్కే పెద్ద కొల్వు, పేపర్ మీద పెన్ను వెడ్తే.. తలరాతలు మార్తయ్. అసొంటిది ఉత్తగ సర్కార్ జీతానికే పన్జేత్తె ఎట్ల అని గీ రైతన్నలకు సూటివెట్టింది. అలియాబాద్ దిక్కుండే కొందరు రైతన్నలు.. 30 ఎకురాల ఎవుసం భూమిని నాలా కింద మార్పిచ్చెతందుకు మేడం తానికి పోయిర్రు. ఇగ వాళ్లను సూడంగనే మేడంకు.. కుక్కకు బొక్క దొర్కినట్టైంది. రేపు.. మాపని తిప్పిచ్చిందట. గిట్లెందుకు తిప్పుతున్నరు మేడమని గట్టిగ అడ్గుతె.. శానా ఖర్సుతోని కూడుకున్న పనని సెలవిచ్చిందట. ఎకురానికి లచ్చ సొప్పున ఖట్నం సద్విచ్చుకోవాల్నని చెప్పిందట. మాతాన గన్ని పైసలు ఎట్లెల్తయ్ మేడమంటె.. వాయిదాల బంపరాఫర్ ఇచ్చింది.
మొదటి విడ్త కింద రెండు లచ్చలు పట్కరమ్మంటే.. పైసలను, ఏసీబోల్లను పట్కొని పోయిర్రు రైతన్నలు. మేడం సుతం శానా తెల్వికల్లదే.. అవినీతి మర్కలు అంటకుంట శాన్నే జాగ్రత్తపడ్డది. ఆమె కారు నడిపే డ్రైవర్ను పంపింది. దొంగలను దొర్కవట్టుట్ల ఏసీబోల్లేం తక్వ గాదు గద. పైసలు తీస్కోంగనే డ్రైవర్ను పట్టుకున్నరు. అటెంక మేడాన్ని పట్టుకొని కెమికల్ నీళ్లల్ల శేత్లు కడిగిపిచ్చిర్రు. దొంగతనం బైటవడ్డంక మేడం న్యాలకు మొఖమేశింది. ఏం తెల్వని ఎర్రిపప్ప లెక్క ఫేసు పెట్టింది. ఇప్పటికి పట్టువడ్డది గింతే కని, ఇప్పటిదాంక ఎంత జోపిందో మరి. నిన్న పట్నంల ఒగ ఎస్సై మేడం.. ఇయ్యాల ఎమ్మార్వో మేడం పట్టువడ్డది సూస్తుంటెనైతే మొగ లంచగొండ్లను ఎన్క వర్సల పెట్టెతట్టే కొడ్తున్నరు. ఇగీ మేడం ముచ్చట వార్తల్లల్ల వైరల్ కాంగనే.. ఛీ.. ఛీ.. ఎందుకీ చిల్లర బతుకని పొట్టు పొట్టు తిడ్తున్నరు. అంతమంచి కొల్వుకు శెడ్డపేరు తెత్తున్నరని గరానికస్తున్నరు. శిల్లర పనుల్తోని ఇజ్జతెందుకు తీసుకుంటరని ఇంకొందరు తిడ్తె.. ఇసొంటోల్లకు ఇజ్జత్ కరువే అని ఇంకొందరు కామెంట్లు వెడ్తున్నరు. జనాలూ.. సూస్తున్నరు గద. లంచగొండి అధికార్లు ఎట్ల మోపైర్రో. మిమ్ముల ఎవలన్న లంచమడుగుతె, ఆల్శం జెయ్యకుంట ఏసీబోల్లకు చెప్పుర్రి. వాళ్లచ్చి లంచగొండి జల్గల పనిపడ్తరు. సరేనా.




