Jordar Varthalu: ఎవర్రా మీరంతా.. ఇలా తయారయ్యారు

Jordar Varthalu: దొంగలు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు!

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 May 2026 7:38 AM IST
Jordar Varthalu
X

Jordar Varthalu: ఎవర్రా మీరంతా.. ఇలా తయారయ్యారు

Jordar Varthalu: సీన్మా రేంజిల స్కెచ్చేశి.. పట్ట పగటీలీ, రోడ్డు నట్ట నడ్మిట్ల పైసల్ లూటీ జేశిర్రుల్ల కొమురంభీం జిల్లా వాంకిడి మండల కేంద్రంల దొంగలు. బ్యాంకులకెల్లి పైసల్ డ్రా చేస్కోని అచ్చేది ముదాలే పసిగట్టి పక్కా ప్లాన్తోటి నిలువు దోపిడి చేశిర్రు పాపం రైతున్నను. ఇగో ఈడ తొవ్వ మీద ‎మొఖ‌ం కనవడకుంట సుట్టుబట్ట సుట్టుకోని అటీటు తిర్గుతున్నొల్లే దొంగ బద్మాష్గాళ్లు. రైతన్న బ్యాంకులకెల్లి పైసల్ డ్రా చేస్కోని అత్తాంటె ఓ దొంగోడు బ్యాంకు కాన్నే ఉండి మొత్తం సూశినట్టున్నడు. ఇగ రైతు పైసల్ డ్రా చేస్కోని బ్యాంకు బైటికచ్చుడు ఆల్శం. బండి మీద ఇంటికి పోతున్న రైతును ప్లాన్ ప్రకారం బురడీ కొట్టిచ్చిర్రు. మరి ఏం ప్లానేశిర్రో ఈ పెయ్యంగని బద్మాష్గాళ్లు గని, ఎంబటే రైతన్న మూల మలుపు మీద బండాపి అచ్చిన దారిలనే నాలుగు అడుగులు ఎన్కకు పోయిండు.

గంతే, అప్పటికే అడ్డమీదున్న ఇంకో దొంగోడొగడు బండ్లె పెట్టిన పైసల్ తీస్కోని అప్పటికే రెడీగ ఉన్న ఇంకో దొంగోని బండెక్కి జంపయ్యిండు. కేసు రాస్కోని సీసీ కెమ్రాల ఆధారంగ పోలీస్లు దొంగల కోసం గాలిస్తున్నరట గని, రైతును ముంచి ఆళ్లేం బాగుపడ్తరోనుల్ల.. దేవుడు సూడకపోతడా.. ఆళ్ల పాపం పండకపోతదా. (060526 MNCL CHORI) ఇగిదిట్లుంటె సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం, ఆరెపల్లి ఊర్లల్ల సుతం రైతుల ఉసురు పోసుకున్నరు దొంగలు. అర్థరాత్రి శిమ్మంశీకట్ల రైతుల పొలాలనే టార్గెట్గ పెట్టుకోనచ్చి కరంటు మోటర్లు, వైర్లు, స్టాటర్లు ఎత్వపేయిర్రు ఆళ్లు మన్నుగాను. ఒక్కటే రాత్రిల పదిహేనుమంది రైతుల పొలాలల్ల లక్ష రూపాల మాలు మాయం జేశిర్రు. అసలే పంటలు కోతకచ్చే టైము.. పొలాలకు ఇంక నీళ్లు సుతం పెడ్తున్నరట రైతులు. ఇసోంటాల్ల దొంగలు శెయ్యంగ పంటలు ఎండిపొయ్యే పర్సితచ్చిందని రైతులు కొద్ది తండ్లాతలేరు పాపం.

ఇన్నరు గదా. దొంగలే అంటే పోలీసులు ఇంక ఘోరమున్నరు. శెప్తె అస్సల్ పట్టిచ్చుకుంటలేరట. అందుకే అచ్చి ఎండిన మా పంటలను సూశన్న దొంగలను పట్టుకోర్రని అనవట్టిర్రు రైతన్నలు. మరి ఏం చేత్తరో పోలీసులు సూడాలె గని, దొంగతనాలైతే మామూలుగ జర్గుతలెవ్వుల్ల. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలనయితే ఏకంగ ఏటీఎం మెషిన్నే ఎత్కపేయిర్రంటె సూడుర్రి.. దొంగతనాలు ఏ రేంజిల జర్గుతన్నయో. తెల్లారే మోపున పుట్టపర్తి రోడ్లున్న IDFC బ్యాంకు ఏటీఎం దొంగతనం కోసమనత్తె.. ఏటీఎం తెర్వ వీలుగాలేదట దొంగలకు. అందుకే ఎంబడి తెచ్చుకున్న బొలెరో బండ్లె ఏకంగ ఏటీఎంనే ఏస్కోని పోయిర్రట. సుట్టుముట్టున్నొల్లకు సప్పుడినచ్చి లేశి సూశేటాళ్లకు ముచ్చట బైటికి తెల్శింది. (060526 ATP DMM ATM CHORI) ఇగిటు ములుగు జిల్లా జే.డి మల్లంపల్లి మండల కేంద్రంల సుతం రెచ్చిపోయిర్రుల్ల దొంగలు. ఇంటి తాళాలు పల్గొట్టి 65 గ్రాముల బంగారం 35 వేల నగదుతోటి పరారయితే, ములుగు పోలీస్ స్టేషండ్ల ఫిర్యాదయిండు మేరుగు రవి అనేటి ఇంటి ఓనరు. అట్ల ఈ ఒక్క జాగల మాత్రం పోలీసులు ఉషారయ్యి, దొంగలను పట్టుకున్నరు. ముగ్గురు దొర్కిర్రట.. ఒక్కడు పరారీల ఉన్నడట. దొంగలను పట్టుకున్న పోలీస్లకు పోలీస్ పెద్దాపీస్లర్ల సన్మానం గుడ జేశిర్రు. మరి కడ్మ జాగల్ల గుడ గిదే తీరుగ డ్యూటీ జేశి పోలీస్ పెద్దాపీసర్లతోటి ఎన్నడు సన్మానం చేయించుకుంటరో సూడాలె ‎ఇగ పోలీసులు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story