Burning Topic: దేశంలో పెరిగిపోతున్న లవ్ జిహాద్ లు.. మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం

Burning Topic: టీసీఎస్ నాసిక్ సెంటర్లో కలకలం రేపుతున్న కార్పొరేట్ జిహాద్. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి యత్నాలపై మహారాష్ట్ర సర్కార్ సీరియస్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 April 2026 8:13 AM IST
Burning Topic
X

Burning Topic: దేశంలో పెరిగిపోతున్న లవ్ జిహాద్ లు.. మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం

Burning Topic: తమ పిల్లలు చక్కగా చదువుకొని పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడాన్ని ప్రతి తల్లిదండ్రులూ గర్వంగా చెప్పుకుంటారు. ప్రతిభకు పెద్ద పీట వేసే కార్పొరేట్, ఐటీ సంస్థల్లో వృత్తి నైపుణ్యాలకు ప్రాధాన్యత ఉంటుంది. అక్కడ ఉద్యోగం అంటే భద్రతకు భరోసా అని భావిస్తారు. ఉద్యోగులకు ఏమాత్రం అసౌకర్యం కలిగినా కంపెనీల అధినేతలు సీరియస్‌గా తీసుకుంటారు. కానీ ఆ ప్రఖ్యాత సంస్థలో కొందరు మత ఛాందసులు సాగిస్తున్న వ్యవహారం తల్లిదండ్రులను, కుటుంబాలను ఆందోళనకు గురి చేస్తోంది. దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కి చెందిన నాసిక్ సెంటర్‌లో జరిగిన వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. అక్కడ జరిగిన లైంగిక వేధింపులు, మత మార్పిడి ఒత్తిళ్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీంతో కొంతమంది ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. వారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు.

టీసీఎస్ నాసిక్ సెంటర్‌లో జరుగుతున్న ఈ వ్యవహారాలపై 2026 ఫిబ్రవరిలో తొలిసారిగా పోలీసులకు ఉప్పందింది. ఒక మహిళా ఉద్యోగి తన సహోద్యోగిపై చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుతో పోలీసు కమిషనర్ సందీప్ దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇది నిజమేనా? అక్కడ అసలేం జరుగుతోందో తెలుసుకోడానికి అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టారు. హౌస్‌కీపింగ్ స్టాఫ్‌గా మారువేషంలో మహిళా కానిస్టేబుళ్లను లోపలికి పంపి, ఆధారాలు సేకరించారు. రోజు వారీ నివేదికలను తెప్పించుకున్నారు. మరోవైపు మార్చి26న ఒక మహిళా ఉద్యోగి యొక్క తల్లిదండ్రులు తమ కూతురు ప్రవర్తనలో, జీవనశైలిలో హఠాత్తుగా మార్పు వచ్చిందని, ఆమెపై ఏదో ప్రభావం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే కాకుండా ఆ ఉద్యోగిని కూడా తనను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఒక సహా ఉద్యోగి రేప్ చేసాడు అని పోలీసు ఫిర్యాదు చేసింది. వ్యవహారమంతా నిర్ధారణ కావడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అనుచితంగా ప్రవర్తిస్తున్న ఓ ఉద్యోగిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

పోలీసుల దర్యాప్తులో ఇంకా అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి. అక్కడ కొంతమంది టీమ్ లీడర్లు మహిళా ఉద్యోగులపై మానసికంగా, లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారు. అసభ్యకరమైన, అవమానకరమైన భాషను ఉపయోగించేవారని చెప్పారు. వారి రహస్య భాగాలను తాకుతూ లైంగికంగా వేధించారు, వారాంతపు విహారయాత్రల నెపంతో బాధితులను రిసార్ట్‌లకు రప్పించి, అక్కడ వారిని లైంగిక వేధింపులకు గురిచేశారు. బీఫ్ తినాలని, మతం మారాలని బలవంతం చేశారు. లిప్‌స్టిక్ వేసుకోవడం మానేయాలని, హిందూ స్నేహితులకు దూరంగా ఉండాలని ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారు.ఈ లీమ్ లీడర్లు ప్రత్యేకించి హిందూ మహిళలనే టార్గెట్ చేశారని స్పష్టమైపోయింది. హిందూ సంప్రదాయాలను లక్ష్యంగా చేసుకుని, పండుగల సమయంలో చీరలు లేదా బొట్టులు ధరించిన మహిళలను అవమానించేవారు. ఆఫీసులో భద్రత పేరుతో మొబైల్ ఫోన్లు, బ్యాగులు, లంచ్ బాక్సులు అనుమతించేవారు కాదు. దీంతో లోపల జరిగే కార్యకలాపాలు బయటకు వచ్చేవి కాదు.

ఇక్కడ అత్యంత ఆశ్యర్యకర విషయం ఏమింటంటే ఈ వ్యవహారాలన్నీ ఓ మహిళ కనుసన్నల్లో జరిగాయి. హెచ్ఆర్ మేనేజర్‌గా చెప్పుకునే నిదా ఖాన్ ఈ ముఠాకు అక్కడ ఉద్యోగినులుగా పని చేస్తున్న వారి సమాచారాన్ని అందించేంది. ముఖ్యంగా పేద కుటుంబాలు, ఉద్యోగం ఎంతో అవసరమైన వారిని గుర్తించేది. వీరైతే తమ కేరీర్ ఉద్యోగ భద్రత, కుటుంబ గౌరవం కోసం ఈ విషయాలు ఎక్కడా చెప్పరనే భావించారు. కొందరైతై ఉద్యోగాలను వదిలేసి వెళ్లిపోయారు. మొత్తం 8 మంది మహిళా ఉద్యోగినులు మానసిక, లైంగిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మొత్తం 8 మంది నిందితులకు గుర్తించారు. వీరిలో తౌసిఫ్ అత్తర్, డానిష్ షేఖ్, రాజా మెమన్, షారుఖ్ ఖురేషి, షఫీ షేఖ్, ఆసిఫ్ అఫ్తాబ్ అన్సారీలను అరెస్టు చేశారు. కేసు నమోదు కాగానే నిదా ఖాన్ పరారీలో ఉన్నారు. ఆ తర్వాత తాను గర్భవతినని, అరెస్టు నుండి రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించింది.

ఈ మొత్తం వ్యవహారంలో ఆందోళన కలిగించే విషయం మన దేశంలో మెజారిటీ ప్రజలు అవలంభిస్తున్న మతాన్ని కించపరచడం.. నిందితులు తమ మతం గొప్పదని అందులోకి మారమని బలవంత పెట్టడంతో పాటు ఇతర మతాలను కించ పరిచారు. దేవుళ్ల ఉనికి ప్రశ్నిస్తూ తక్కువ చేసి మాట్లాడేవారు. మహిళా ఉద్యోగులు వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు పాటిస్తున్న సమయంలో వారిన ఎగతాళి చేస్తూ అవమాన పరిచారు. ఎవరైనా మహిళా ఉద్యోగులు తమ ఇష్టదైవాల ఫోటోలను టేబుల్ మీద పెట్టుకుంటే ఆ దేవతపై విపరీత వ్యాఖ్యానాలు చేసేవారు. కనిపించనివాడే నిజమైన దేవుడు. మీ దేవుళ్లు కనిపిస్తారు కాబట్టి, వారు దేవుళ్లే కాదు అంటూ నిందించారు. ఇదంతా మొదట సాధారణ ఫిర్యాదులాగే కనిపించినా.. రానూ రానూ మతపరమైన అంశం, బలవంతమైన వేధింపులు, మానవ అక్రమ రవాణా లాంటి అనుమానాలున్నాయా? అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. మరో రకంగా చెప్పాలంటే ‘‘కార్పొరేట్ జిహాద్’’ గా కొందరు అభివర్ణిస్తున్నారు.

టీసీఎస్ నాసిక్‌లో నిందితులు ఒక ముఠాగా ఏర్పడి, ప్రణాళికాబద్ధంగా మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారని దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలో మత మార్పిడి కోణం, ఇతర దేశాలతో సంబంధాలు, ఆర్థిక సాయం అందుతోందనే సమాచారం కూడా ఉంది. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం - సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ - ఎన్‌ఐఏ కూడా రంగంలోకి దిగింది. కాగా వృత్తిపరమైన నిపుణులు, విద్యాంతులతో ముడిపడి వుండే కార్పొరేట్ వాతావరణంలో ఇలాంటి దారుణాలు వెలుగు చూడటం ఆందోళనకు గురి చేస్తోంది.ఇన్ని రోజుల పాటు ఈ జిహాద్ అంశం కార్పొరేట్ ప్రాంతాలకు పాకలేదు. కానీ.. ఇప్పుడు ఇలాంటి ప్రాంతాలు కూడా మహిళల భద్రతకు భరోసా ఇవ్వకపోవడం ఆందోళనకరమంటున్నారు హిందూ ధర్మచక్రం సంస్థ వ్యవస్థాపకులు శ్రీకాంత్ శర్మ.

టీసీఎస్ లాంటి ప్రఖ్యాత సంస్థలో ఇలాంటి కార్పొరేట్ జిహాద్ చర్యలు జరగడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. బాధితుల నుండి వచ్చిన 70కి పైగా ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా అక్కడి హెచ్‌ఆర్ మేనేజర్ నిదాఖాన్‌ అడ్డుకుంది. పైనా నిందితులకే సహకరించింది. పోలీసులు ఆమెను కీలక 'సూత్రధారి'గా గుర్తించారు. నిందితుల మధ్య జరిగిన సుమారు 78 అనుమానాస్పద కాల్ రికార్డులు, ఈమెయిళ్లు, చాట్ సంభాషణలతో సహా పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఆర్థిక లావా దేవీలు జరిగినట్లు కూడా అనుమానిస్తున్నారు. సంస్థ పరువు పోయిన తర్వాత టీసీఎస్ యాజమాన్యం స్పందించింది. అరెస్టయిన ఉద్యోగులను సంస్థ నుంచి తొలగించినట్లు ప్రకటించింది. ఉద్యోగుల దుష్ప్రవర్తన, వేధింపుల విషయంలో సంస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోదని ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తామని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం బలవంతపు, మోసపూరిత మత మార్పిడిలను అరికట్టే లక్ష్యంతో రూపొందించిన 'మత స్వేచ్ఛ బిల్లు 2026'కు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఎవరి చేతనైనా బలంవంతంగా, మోసాలు చేసి, ప్రలోభ పెట్టి మతాలను మారిస్తే 7 ఏళ్ల జైలుశిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించనున్నారు. లాగే మైనర్లు, మహిళలు, ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని మార్పిడిలకు పాల్పడితే 7 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ. 5 లక్షల భారీ జరిమానా ఉంటుంది. అంతేకాకుండా సామూహికంగా మత మార్పిడిలు చేసినా అదే ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 5 లక్షల జరిమానా విధిస్తారు. ఒకే నేరాన్ని మళ్లీ మళ్లీ చేసేవారికి శిక్షా కాలాన్ని 10 ఏళ్లకు పెంచుతారు. ఈ చట్టం ఏ మతానికీ వ్యతిరేకం కాదు. బలవంతపు మార్పిడిలతో మోసపోతున్న మహిళల సంరక్షణ కోసమే దీనిని తెచ్చామని తెలిపారు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. ఆర్టికల్ 25 ప్రకారం ఎవరైనా నచ్చిన మతాన్ని అనుసరించవచ్చు. కానీ మోసపూరితంగా మార్చే హక్కు ఎవరికీ లేదన్నారు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story