Burning Topic: రోజుకో మలుపు తీరుగుతున్న మోనాలిసా కేసు

Burning Topic: సోషల్ మీడియా స్టార్ మోనాలిసా భోస్లే పెళ్లి వెనుక ఉన్న సంచలన నిజాలు ఏంటి? ఆమె ఎందుకు కనిపించకుండా పోయింది?

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 April 2026 7:10 AM IST
Burning Topic
X

Burning Topic: రోజుకో మలుపు తీరుగుతున్న మోనాలిసా కేసు

Burning Topic: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గత ఏడాది జరిగిన ప్రపంచ ప్రఖ్యాత మహా కుంభమేళాలో పూసల దండలు అమ్ముకుంటూ తళుక్కున మెరిసింది మోనాలీసా భోంస్లే. అలా మోనాలీసా పేరు సోషల్ మీడియాలో మారుమోగింది. కుర్రకారుకి క్రష్‌గా కూడా మారింది. ప్రస్తుతం ఆమె పేరు మరోసారి వార్తల్లో రీసౌండ్ చేస్తోంది. మోనాలిసా ముచ్చటపడి చేసుకున్న పెళ్లి తంతు.. వివాదంగా మారింది. ఆమె వయస్సు చుట్టూ వివాదం మరింత ముదురుతోంది. ప్రియుడు, నటుడు ఫర్మాన్ ఖాన్‌‌ను పెళ్లాడి ఫ్యాన్స్‌ అందరికీ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది మోనాలీసా. కేరళలోని పూవార్ అరుమనూర్‌లో ఉన్న నైనార్ ఆలయంలో మార్చి 11న ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. కేరళ ప్రభుత్వానికి చెందిన K-SMART యాప్ ద్వారా వీరి వివాహం చట్టబద్ధంగా నమోదైంది. కేరళ మంత్రి వి.శివన్‌కుట్టి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి.గోవిందన్ ఈ వేడుకకు హాజరైనట్లు కేరళ మీడియాలో వార్తలొచ్చాయి.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసాకు మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్‌ ఖాన్‌తో 'నాగమ్మ' అనే మలయాళ సినిమా షూటింగ్ సమయంలో పరిచయం ఏర్పడింది. ఇందులో ఫర్మాన్ ఖాన్ విలన్‌గా, మోనాలీసా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. మతాలు వేరు కావడంతో మోనాలిసా తండ్రి జై సింగ్ భోంస్లే ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమా షూటింగ్ కోసం మోనాలిసా కేరళకు రాగా.. తండ్రి కూడా అక్కడకు వెళ్లి ఆమెతో గొడవకు దిగారు. దీంతో ప్రాణహాని ఉందని భయపడిన ఈ జంట, తమ ప్రేమను కాపాడుకునేందుకు పోలీసులను ఆశ్రయించారు. తన తండ్రి విజయ్ సింగ్ భోంస్లే తను చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని మోనాలిసా ఫిర్యాదు చేసింది. తాను మేజర్‌ అని.. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి చేసుకోవాలనుకున్నాననీ మోసాలిసా తెగేసి చెప్పింది. దీంతో పోలీసు అధికారులు ఆమెకు భద్రత కలిపించారు. అయితే శారీరకంగా ఆమెకు ఎలాంటి వేధింపులు జరగలేదన్నారు. కేవలం బలవంతపు వివాహ ప్రతిపాదన వల్లే పోలీసుల భద్రత కోరుకుందని తెలిపారు పోలీస్ అధికారులు.

ఈ పెళ్లి 'లవ్ జిహాద్' అని సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఈ జంట కూడా క్లారిటీ ఇచ్చింది. తమ మతాలు మార్చుకోలేదని మోనాలీసా తేల్చిచెప్పింది. తాను హిందువుగా, తన భర్త ముస్లింగానే కొనసాగుతామని మోనాలీసా వివరించింది. ఈ పెళ్లి తన సొంత నిర్ణయమని, ఎవరి బలవంతం లేదనీ స్పష్టం చేసింది. తన తండ్రి తనతోపాటు కేరళకు వచ్చినప్పటికీ, ఈ పెళ్లి పట్ల ఆయన ఇంకా అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే ఆయనను ఒప్పించుకోగలననే ధీమా వ్యక్తం చేసింది. మేనత్త కొడుకుతో పెళ్లి చేయాలని పేరెంట్స్ ఆశించారని, కానీ తనకు ఇష్టం లేక ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్నానని ఆమె క్లారిటీ ఇచ్చింది. మరోవైపు ఫర్మాన్‌ఖాన్ కూడా మీడియాకు క్లారిటీ ఇచ్చారు. "ప్రేమలో మత మార్పిడి అవసరం లేదు" అని తెలిపారు. మోనాలిసా కోరుకున్న విధంగా ఆచారాలను అనుసరించడానికి తాను అంగీకరించానన్నారు. మోనాలిసా ఆనందమే తన ఆనందమని చెప్పుకొచ్చారు. పైగా తమకు కేరళ ప్రజల మద్దతు లభించడం సంతోషమని, మోనాలీసాకు ఇష్టమైతే అక్కడే స్థిరపడతామనీ కూడా వివరించారు.

ఈ క్రమంలో మోనాలీసా పెళ్లి తంతు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. మధ్యప్రదేశ్ పోలీసులు విచారణ కోసం హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, ప్రస్తుతం ప్రయాణం చేయలేరని ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ పోలీసులకు తెలియజేశారు. ఈ కేసులో మోనాలిసా మైనర్ అన్న ఆరోపణలు మొదటి నుంచీ వినిపిస్తున్నాయి. పెళ్లి సమయంలో ఆమెకు 18 ఏళ్లు నిండాయని కేరళ పోలీసులు ధృవీకరించినప్పటికీ, జాతీయ ఎస్టీ కమిషన్ విచారణలో ఆమె మైనర్ అని తేలడం తీవ్ర కలకలం రేపింది. ఎస్టీ కమిషన్ నివేదిక ఆధారంగా ఫర్మాన్ ఖాన్‌పై మధ్యప్రదేశ్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. మైనర్ అమ్మాయితో వివాహం చెల్లదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా మధ్యప్రదేశ్ పోలీసులు విచారణకు పిలవగా, ఫర్మాన్ ఖాన్ స్పందించారు. మోనాలిసా ప్రస్తుతం గర్భవతి అని, ఆమె ఆరోగ్యం సరిగా లేదని చెప్పుకొచ్చారు. వైద్యుల సలహా మేరకు ఆమెకు పూర్తి విశ్రాంతి అవసరమని తెలిపారు. పైగా సుదూర ప్రయాణం చేయడం ఆమెకుగాని, కడుపులో ఉన్న శిశువుకు గానీ ఆరోగ్యకరం కాదని వివరించారు. అందుకే తాము విచారణకు హాజరు కాలేకపోతున్నామని పోలీసులకు క్లారిటీ ఇచ్చారు ఫర్మాన్ ఖాన్. ఈ క్రమంలో హైకోర్టు జోక్యంతో అరెస్టు నుంచి ఈ జంట తాత్కాలిక ఉపశమనం పొందిందని సమాచారం. అయినప్పటికీ ఒకవైపు పోలీసుల విచారణ, మరోవైపు మైనారిటీ వివాదం నడుస్తుండగానే మోనాలిసా కనిపించకుండా పోవడం ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సోషల్ మీడియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఒక సామాన్య యువతి జీవితం ఇలాంటి న్యాయపరమైన చిక్కుల్లో పడటం అభిమానులను కలచివేస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

ప్రస్తుతం వీరిద్దరూ ఎక్కడున్నారనే విషయంపై స్పష్టత లేనట్లు తెలుస్తోంది. ఆ జంట ఉపయోగించిన ఫోన్ నంబర్లు కూడా స్విచ్ఛాఫ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వారు కేరళలోనే ఉండవచ్చనని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని గుర్తించేందుకు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.

ఒకవైపు పోలీసుల విచారణ, మరోవైపు మైనారిటీ వివాదం నడుస్తుండగానే మోనాలిసా కనిపించకుండా పోవడం ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సోషల్ మీడియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఒక సామాన్య యువతి జీవితం ఇలాంటి న్యాయపరమైన చిక్కుల్లో పడటం అభిమానులను కలచివేస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

మరోవైపు, ఈ కేసు రాజకీయ ఉద్రిక్తతలకు కూడా దారితీసింది. కేరళలో పలు రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో వివాదం మరింత ముదిరింది. కేంద్ర సంస్థలు కూడా ఈ కేసులో జోక్యం చేసుకోవడంతో విషయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండటంతో, గతంలో ఘనంగా వేడుకల్లో పాల్గొన్న సీపీఎం నాయకులు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. ‘పోక్సో’ చట్టం ప్రకారం మైనర్ల వివాహానికి సహకరించడం లేదా మద్దతు ఇవ్వడం నేరం. ఈ విధంగా చూస్తే పెళ్లికి సహకరించిన ప్రజాప్రతినిధులు చట్టపరమైన విచారణను ఎదుర్కోవాల్సి రావచ్చని తెలుస్తోంది. వివాహ సమయంలో జంట సమర్పించిన పత్రాలను మాత్రమే పరిశీలించామని, ఆ పత్రాలు నకిలీవన్న విషయం తమకు తెలియదని ఆలయ అధికారులు, కొందరు నేతలు చెబుతున్నారు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story