Jordar News: భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టింది
Jordar News: సోషల్ మీడియాలో వ్యూస్ కోసం తన బంగారు నగలను ప్రదర్శించిన మహిళకు భారీ మూల్యం.
Jordar News: భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టింది
Jordar News: అబ్బబ్బ అక్క శానా రిచ్చున్నట్టుంది గద. దేశం మీది బంగారమంత అక్క దగ్గరనే ఉన్నట్టుంది పోర్రి. రవ్వల నెక్లెస్లు, పొడుగు హారం, అష్టలక్ష్మీ వడ్డాణం, చెవ్వుల కమ్మలు, వంకీలు, జుంకాలు, మాటీలు, కాసుల పేరు, చోకర్లు, మామిడి పిందెల హారం, శేతి గడియారం, శిన్నఫంక్షన్లకేశే సన్నటి శైను, ఉంగురాలు, ముక్కుపుల్లలు.. జ్యూవెల్లరీల దొర్కే ప్రతొక్క నగ ఉన్నది గద. మధ్యప్రదేశ్ దిక్కు ఖైద్వా అనే ఊర్లుంటది గీ అక్క. పేరు రచనా గుర్జర్. గింతగనం నగలున్నయ్, మరి అక్క సాఫ్టువేరా.
హార్డువేరా అంటే.. అంతకు మించిన యూట్యూబరు. వృత్తికి న్యాయం జెయ్యాల్నని.. అందరు హోంటూర్లు ఇడ్శినట్టు గీమె, నగల వ్లాగును ఇడ్శింది ఇంటర్నెట్ల. హాయ్ ఫ్రేండ్స్.. నా దగ్గర ఇంత బంగారమున్నది ఫ్రేండ్స్.. లేటెస్టు నగలు, ఒక్కొక్కటి అచ్చి బీర్వల పడ్తున్నయ్ ప్రేండ్స్ అని వీడియో జేశింది. అక్క ట్యాలెంటుకు లచ్చల లైకులు, మిలియన్ల వ్యూస్ అచ్చినయ్ కనీ.. అటెంక అదే యూట్యాబ్ చానల్ల గీ వీడియో ఇడ్వాల్శొచ్చింది.
అయ్యో.. పాపం.. ఎవల జిట్టి తల్గిందో అక్కనగలకు. మేకప్ ఏస్కోకుంటనే.. కెమ్రా ముంగట గోడెల్ల పోసుకునే కాడికచ్చింది గద కథ. ఇట్ల రీల్ జేశెతందుకు కారణమేందంటే.. నిన్న మాపటి యాల్ల అక్క ఫంక్షన్కు పోయిందట. ఇగ అచ్చి సూస్తె.. బట్టలు శిల్లంకల్లం అయ్నయట. బీర్వా లాకర్ పల్గొట్టి ఉన్నదట. అక్క దాశ్న ఆరు లక్షల రూపాల నగలను, రెండు లచ్చల పైకాన్ని పట్కొని పరారైన్రట దొంగలు. ఇగ ఎంబటే పొయ్యి పోలీసోల్లకు ఫిర్యాదైందట. గోప్యంగ దాశే వాటిని వీడియోలు తీశి పెడ్తే, దొంగ శేతికి తాలాలిచ్చినట్టే అయితదని ఖాకీలు బుద్ది చెప్పి ఎల్లగొట్టిర్రట. ఇగ నిమ్మలంగ ఇంటికచ్చి, హాయ్ ఫ్రెండ్స్.. నా నగలను ఆగం జేశిర్రు ప్రెండ్స్.. అని ఇంటర్నెట్ల ఇడ్శింది.
ఇగ అక్క ఇడ్శేది ఇడ్వంగనే.. అక్క దున్యా ఫేమసైంది. అక్క గోల్డుకు దొంగలు రక్ష అనుకుంట టైటిల్లు పెట్టి వైరల్ జేస్తున్నరు. అన్నిటిని ఇంటర్నెట్ల ఇడుస్తే.. ఇట్లనే ఉంటదనుకుంట సొట్లు వెడ్తున్నరు అక్క వీడియోలు ఇడ్వకుంట సూస్తున్న జనాలు. కొత్త బిచ్చెగాడు పొద్దెరగడన్నట్టు.. ఏ వీడియోలు పెట్టాల్నో.. ఏ వీడియోలు పెట్టద్దో తెల్వకపోతె ఎట్ల చెప్పుర్రి.




