Burning Topic: వాతావరణ శాఖ శుభవార్త.. నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి
Burning Topic: నైరుతి రుతుపవనాలు మరో రెండు మూడు రోజుల్లో కేరళను తాకనున్నాయి.
Burning Topic: వాతావరణ శాఖ శుభవార్త.. నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి
Burning Topic: భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఇది ఓ రకంగా శుభవార్త అనే చెప్పొచ్చు. నైరుతి రుతుపవనాలు మరో 2,3 రోజుల్లో కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అరేబియా సముద్రంలో నైరుతి, ఆగ్నేయ ప్రాంతాలకు, లక్షద్వీప్‌నకు, కేరళ.. తమిళనాడులోని కొన్ని భాగాలకు ఇవి విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వివరించింది. నైరుతి, పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకూ రుతుపవనాలు పురోగమించే అవకాశాలున్నాయి. అయితే... మరో పిడుగులాంటి వార్త కూడా లేకపోలేదు. అదే సూపర్ ఎల్‌నినో ముంచుకురావడం. ఏకంగా ఆరు నెలలపాటు వర్షాభావ పరిస్థితులు ఎదురుకానున్నాయని ఇదే వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రోళ్లు సైతం పగిలిపోయేలా దంచికొడుతున్న రోహిణి కార్తె ఎండలకు విలవిల్లాడుతున్న జనానికి వాతావరణ శాఖ అతి త్వరలో రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల నేలను తాకనున్నాయన్న వార్త ఒకింత చల్లని కబురే. అదే రెండు, మూడు రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు త్వరలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కూడా విస్తరించనున్నాయని ఐఎండీ చెబుతోంది. అయితే మే 26నే నైరుతి రుతుపవనాలు కేరళకు రావచ్చని ఐఎండీ తొలుత అంచన వేసింది. మే 29న ఆ అంచనాలను సవరించి.. తదుపరి వారంలో ఇవి రావచ్చని తెలిపింది. ఎల్ నినో పరిస్థితుల వల్ల ఈసారి సాధారణం కంటే తక్కువగానే వానలు పడతాయనీ హెచ్చరించింది. పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడనున్నాయని, జూన్‌లో ఇవి బలహీనంగా ఉన్నా సెప్టెంబరులో మాత్రం బలంగా ఉండే అవకాశం లేకపోలేదని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
భగభగమండే ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు రుతుపవనాల ఆగమనం నిజంగా చల్లని వార్తే అవుతుంది. కానీ పశ్చిమ గాలులు బలహీనపడటంతో కేరళలో నైరుతి రుతుపవనాల ప్రవేశం కాస్త ఆలస్యమవగా.. రాబోయే రెండు, మూడు రోజుల్లో ఇవి తీరాన్ని తాకేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయట. ఈ ఏడాది వర్షాలపై పసిఫిక్ మహాసముద్రంలో 'ఎల్ నినో' ఏర్పడి, దాని ప్రభావం తీవ్రంగా ఉండబోతోందని తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తోంది ఐఎండీ. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో వర్షాలు నిజంగా పడతాయా..? పడవా..? అన్న ఆందోళన రైతులు, ప్రజల్లో కూడా నెలకొంది.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల గమనం తీవ్ర ఊగిసలాటల మధ్య సాగుతోంది. తొలుత మే 26నే ఇవి కేరళకు వస్తాయని వాతావరణ శాఖ వేసిన అంచనా తప్పయ్యింది. ఇలా మే 26, 28, జూన్ 1, జూన్ 3 అంటూ అంచనా తేదీలు మారుతూ వస్తుండటంతో రుతుపవనాల ఆగమనంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా కేరళలోని నిర్ణీత 60 శాతం ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభం కావాలి. దాంతోపాటు అరేబియా సముద్రం మీదుగా వీచే పశ్చిమ గాలులు ఒక నిర్దిష్ట వేగంతో కదులుతూ.. ఉపగ్రహాల ద్వారా తగినంత మేఘాల సాంద్రత నమోదైనప్పుడు మాత్రమే రుతుపవనాలు వచ్చినట్లు అధికారికంగా ప్రకటిస్తారు. అయితే ప్రస్తుతం ఈ పశ్చిమ గాలులు మరీ బలహీనంగా మారడమే ఈ జాప్యానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
అయితే నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యం అయినప్పటికీ.. ప్రస్తుతం అవి అరేబియా సముద్రంలోని నైరుతి, ఆగ్నేయ ప్రాంతాలతో పాటు లక్షద్వీప్, కేరళ, తమిళనాడులోని కొన్ని భాగాలకు విస్తరించడానికి వాతావరణం అనుకూలిస్తోందట. అలాగే నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల వైపు ఇవి పురోగమించేందుకు మార్గం సుగమమవుతోందట. ఈ క్రమంలో జూన్ 8 నాటికి రుతుపవనాలు రాకపోయినా.. దానిని తీవ్రమైన ఆలస్యంగా పరిగణించలేమంటున్నారు వాతావరణ నిపుణులు. కేరళకు కొద్దిరోజులు ఆలస్యంగా నైరుతి వచ్చినంత మాత్రాన మిగతా దేశవ్యాప్తంగా వర్షపాతానికి పెద్దగా సమస్యలు రావని అభిప్రాయపడుతున్నారు.
ఈ ఏడాది వర్షపాతంపై పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న 'ఎల్ నినో' ప్రభావం స్పష్టంగా ఉండబోతోందని ఐఎండీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా ఈసారి సాధారణం కంటే తక్కువగానే వర్షాలు కురిసే అవకాశం ఉందట. జూన్ నెలలో ఈ ఎల్ నినో ప్రభావం కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ.. వ్యవసాయానికి అత్యంత కీలకమైన సెప్టెంబరు మాసానికి వచ్చేసరికి ఇది చాలా బలంగా మారే ప్రమాదం ఉందని అంచనా. ఎల్ నినో కాని, అంతకు మించి సూపర్ ఎల్‌నినో ప్రభావంతో దేశంలో వర్షాల కొరత ఏర్పడే ప్రమాదం ఉందట. ఫలితంగా భూగర్భ జలాలు మరింత అడుగంటిపోయే ఛాన్స్ ఉందంటున్నారు. వర్షాలు లేక వ్యవసాయ భూములు బీడువారిపోవడం సహజమే. అయితే భావులు, బోరుభావుల ఆధారంగా సాగు చేద్దామన్నా.. భూగర్భ జలాలు కూడా కరువయ్యే ప్రమాదం ఉందట. దీంతో అన్నదాతలు నారుమళ్లు వేసుకోవడం మొదలు.. పంట పండించడం కూడా కనాకష్టం కానుంది. దీంతో రైతాంగం తగిన ప్రత్యామ్నాయ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఐఎండీ అధికారులు.




