Burning Topic: యూరప్‌ను వణికిస్తున్న కార్చిచ్చు

Burning Topic: ప్రపంచవ్యాప్తంగా ఘోర అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 July 2026 10:36 AM IST
Burning Topic
X

Burning Topic: యూరప్‌ను వణికిస్తున్న కార్చిచ్చు

Burning Topic: స్పెయిన్‌‌ను అతిపెద్ద కార్చిచ్చు ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇప్పటికే 13 మంది మంటలకు బలైపోయారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. సుమారు 7,000 హెక్టార్లకు పైగా అటవీ భూమి దగ్ధమైంది. మంటలను అదుపు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు.

తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాలులతో స్పెయిన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. మరోవైపు థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని ఓ పబ్‌లో భారీ అగ్నిప్రమాదం 27 మందిని బలి తీసుకుంది. భారీగా చెలరేగిన మంటల్లో కుర్చీలు, బల్లలు క్షణాల్లో కాలి బూడిదయ్యాయి. నిర్వాహకుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story