Off The Record: శ్రీకాకుళం వైసీపీలో ఆధిపత్య పోరు!
Off The Record: శ్రీకాకుళం వైసీపీలో తీవ్ర ఆధిపత్య పోరు. బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యంపై ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు. వివరాలు ఇక్కడ చూడండి.
Off The Record: శ్రీకాకుళం వైసీపీలో ఆధిపత్య పోరు!
Off The Record: శ్రీకాకుళం జిల్లా వైసీపీ బాధ్యతలను ప్రస్తుతం వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చూస్తున్నారు. జిల్లాలో జరుగుతున్న ప్రతి విషయాన్ని పార్టీ పెద్దలకు బొత్స రిపోర్టు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు జిల్లాలోని ఆ పార్టీ సీనియర్ నేతలకు ఏ మాత్రం రుచించడం లేదట. అంతేకాదూ.. బహిరంగంగానే తమ అసహనం వ్యక్తం చేస్తున్నారట. అసలు మీరెవరు..? మా మీద మీ పెత్తనం ఏమిటంటూ బహిరంగ వ్యాఖ్యలు చేసే వరకు పరిస్థితి చేరుకుందట. తాజాగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు వైసీపీలో ఆధిపత్య పోరును బయటపెట్టాయి. "పక్క జిల్లా నేతల సలహాలు మాకు అనవసరం. ముందు అక్కడే ఓ పెద్ద లోపముంది. దాన్ని చూసుకోమనండి." అంటూ రామ్ మనోహర్ నాయుడు అలియాస్ చిన్ని చేసిన విమర్శలు ఇప్పుడు రీసౌండ్ చేస్తున్నాయి. నిప్పు లేనిదే పొగరాదు అన్న చందాన సదరు చిన్ని వ్యాఖ్యలు.. ధర్మాన ప్రసాదరావుకు తెలియకుండా మాట్లాడే ఛాన్స్ లేదన్న వాదన బలంగానే వినపడుతోంది.
"2004 నుంచి ధర్మాన ప్రసాదరావును గెలిపించింది పక్క జిల్లా నేతలు కాదన్న విషయం గుర్తుంచుకోవాలంటున్నారు. మేము కూడా పక్క జిల్లాకు వెళ్లగలం. వారి సలహాలు, సూచనలు ఇక్కడ అవసరం లేదు. శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ జెండా మోయడానికి మనిషి లేనప్పుడు మా నాన్న ఇక్కడ పార్టీని నిలబెట్టారు. ఇక్కడ ఉన్న వారంతా ధర్మాన కేడరే. ఎవరి పెత్తనం మాకు అక్కర్లేదు. నా తలను నేనే దువ్వుకుంటే పాపిడి తిన్నగా వస్తుంది. పక్కోడు దువ్వితే వంకర టింకర పోతుంది.” అంటూ ధర్మాన చిన్ని ఘాటు వ్యాఖ్యలు జిల్లావ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఈ నెల 31న పార్టీ కార్యాలయం టౌన్‌హాల్‌లోకి మారుతున్న సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం కోసం ధర్మాన బంగ్లాలో కేడర్‌తో చిన్ని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది.
VO3: అయితే చిన్ని చేసిన ఈ వ్యాఖ్యలు.. పరోక్షంగా బొత్స సత్యనారయణను ఉద్దేశించినవేనన్న అభిప్రాయం రాజకీయ విమర్శకుల్లో వ్యక్తమవుతోంది. అయితే ఇప్పుడెందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందన్న సందేహం కూడా లేకపోలేదు. చిన్ని ఇలా మాట్లాడిన సమయంలో ఆయన తండ్రి ప్రసాదరావు విజయవాడలో బీసీల సమావేశానికి హాజరయ్యారు. చిన్ని చేసిన వ్యాఖ్యలపై బొత్స అభిమానులు, కాపు సామాజిక వర్గం నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. పార్టీ పెద్దలు చెబితేనే శ్రీకాకుళం జిల్లాకు బొత్స వస్తున్నారని, అంతే తప్ప ఆయనకు రావాల్సిన అవసరం లేదని ఆయన అనుచరులు స్పష్టం చేస్తున్నారు. బొత్స సీనియారిటీ, ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానుల గురించి జగన్‌కు తెలుసు కాబట్టే.. పార్టీ ఓడిన వెంటనే.. ఎమ్మెల్సీ చేసి.. వైసీపీ పక్ష నేతగా ఎంపిక చేశారని గుర్తు చేస్తున్నారు.
VO4: మరోవైపు ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో వెలమ నేతల పెత్తనం ఎక్కువైందని కాళింగ వర్గం నేతలు గుర్రుగా ఉన్నారు. తాజాగా చిన్ని చేసిన వ్యాఖ్యలతో కాపు నేతల్లో కూడా వెలమల పట్ల అసహనం పెల్లుబికుతోందట. దీనిపై జిల్లా వ్యాప్తంగా కాపులు గుర్రుగా ఉన్నారట. ఈ నెల 31న ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో చేపట్టిన పార్టీ సమావేశానికి దూరంగా ఉండాలని కూడా నిర్ణయం తీసుకున్నారట. దీనిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయాలని.. ధర్మాన చిన్నిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బొత్స అనుచరులు. పక్క జిల్లా నేతల సలహాలు, సూచనలు మాకు అవసరం లేదంటున్న ధర్మాన.. గతంలో పక్క జిల్లా నేతలతో ఎందుకు మంతనాలు జరిపారో చెప్పాలని కూడా సవాల్ చేస్తున్నారు.
VO5: మొత్తానికి ధర్మాన చిన్ని చేసిన వ్యాఖ్యలు.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వైసీపీ నేతల మధ్య విభేదాలను మరోసారి బయటపెట్టినట్టయ్యింది. జిల్లాలో అత్యధిక ఓట్ షేర్ ఉన్న కాపు కులస్తులు మా గుగ్గురువునే అంటారా..? రాబోయే రోజుల్లో కాపు తడాఖా చూపిస్తామంటూ గుర్రుగా ఉన్నారట. శ్రీకాకుళం జిల్లా వైసీపీలో చిన్ని తాజా వ్యాఖ్యలు ఏ మలుపు తిప్పుతాయో చూడాలి.




