BIG Debate: రూ. 22 వేల కోట్ల బకాయిలు.. కేవలం రూ. 6.5 కోట్లకే సెటిల్‌మెంట్‌: సుభాష్ చంద్ర ఎన్‌సీఎల్‌టీ కేసుపై తీవ్ర చర్చ

BIG Debate: జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు సంబంధించిన రూ.22 వేల కోట్ల రుణ బకాయిల కేసులో ఎన్‌సీఎల్‌టీ సంచలన తీర్పు వెలువరించింది.

Arun Chilukuri
Published on: 1 Sept 2026 10:55 AM IST
BIG Debate
X

BIG Debate: రూ. 22 వేల కోట్ల బకాయిలు.. కేవలం రూ. 6.5 కోట్లకే సెటిల్‌మెంట్‌: సుభాష్ చంద్ర ఎన్‌సీఎల్‌టీ కేసుపై తీవ్ర చర్చ

BIG Debate: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కార్పొరేట్ రుణాల వసూలు వ్యవహారంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ మీడియా సంస్థ జీ గ్రూప్ (Essel Group) వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా ప్రక్రియకు సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) వెలువరించిన తీర్పు తీవ్ర చర్చనీయాంశమైంది. సుమారు రూ. 22,000 కోట్లకు పైగా ఉన్న రుణ బకాయిలకు గాను, కేవలం రూ. 6.5 కోట్లు చెల్లించేలా ట్రిబ్యునల్ ఆమోదం తెలపడంపై ఆర్థిక వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సుభాష్ చంద్ర వ్యక్తిగత పూచీకత్త కింద ఉన్న మొత్తం రూ. 22,006 కోట్ల దావాకు బదులుగా, ఆయన వ్యక్తిగత ఎస్టేట్ నుంచి కేవలం రూ. 6.5 కోట్లు మాత్రమే చెల్లించేలా NCLT బెంచ్ ఆమోదం తెలిపింది. దీనివల్ల బ్యాంకులు దాదాపు 99.97 శాతం నష్టపోవాల్సి వస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story