Jordar News: రేయ్ ఈ పోస్టర్ చేసింది ఎవడ్రా?
Jordar News: సూర్యాపేట జిల్లాలో విద్యాశాఖ అధికారుల ఘోర నిర్లక్ష్యం బయటపడింది. ప్రభుత్వ ఫ్లెక్సీలో సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలను తారుమారు చేశారు.
Jordar News: రేయ్ ఈ పోస్టర్ చేసింది ఎవడ్రా?
Jordar News: ఇగో.. ఈడ వెట్టిన ఫ్లెక్సీని మంచిగ సూడుర్రుల్లా. డీఈవో.. అంటే., జిల్లా విద్యాశాఖ అధికారి అని జెప్పి రేవంత్ రెడ్డి సారు ఫోట్వ వెట్టిర్రు. ఇగట్లనే కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఫోట్వ పెట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు జేశిర్రు సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారులు. సరే.. ఆ ఫ్లెక్సీలు తయ్యారు చేయించేటప్పుడు ఫోట్వలు తారుమారు అయినయిగావచ్చని అనుకుందాం. అంత అయిపోయినంకనన్న సూస్కోవద్దా, ఆఖర్కు అక్కడ పెట్టినంక అయినా సూశి ఆ ఫ్లెక్సీలను తీసి పక్కకు వెట్టద్దా. నెరీ గింత నిర్లక్ష్యంగ ఉంటరా అని మస్తు మంది కోపానికస్తున్నరు. ఇగ దీన్ని ఫోట్వలు, వీడియోలు తీశి సోషల్ మీడియా వెట్టి సీఎం రేవంత్ రెడ్డికి కొత్త పోస్టు అచ్చిందని అనుకుంట పొట్టుపొట్టు వైరల్ జేస్తున్నరు. మరిట్ల జేశ్న అధికారుల మీద ఏం శెర్యలు తీస్కుంటరో గనీ., ఇసొంటి వాటిపట్ల అధికారులు ఇప్పట్కైనా తగు జాగ్రత్తలు తీస్కుంటరో ఎట్లనో సూడాలె మరి.




