BIG Debate: ‘సిస్టమే కరప్ట్’.. కార్పొరేట్ దిగ్గజాలకు కొమ్ముకాస్తున్నదెవరు?
BIG Debate: దేశంలో కార్పొరేట్ దిగ్గజాలు వేల కోట్లు ఎగ్గొడుతున్నా చట్టాలు వారికి అనుకూలంగా మారుతున్నాయని, సిస్టమ్ పూర్తిగా కరప్ట్ అయిందని hmtv డిబేట్‌లో వక్తలు మండిపడ్డారు.
BIG Debate: ‘సిస్టమే కరప్ట్’.. కార్పొరేట్ దిగ్గజాలకు కొమ్ముకాస్తున్నదెవరు?
BIG Debate: దేశ ఆర్థిక వ్యవస్థలో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న బడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాల తీరుపై hmtv నిర్వహించిన ‘బిగ్ డిబేట్’లో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు మరియు కార్పొరేట్ల మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందాల వల్లే దేశంలో ఆర్థిక నేరస్థులు సులభంగా తప్పించుకోగలుగుతున్నారని వక్తలు మండిపడ్డారు.
కార్పొరేట్లు బ్యాంకుల నుంచి తీసుకున్న వేల కోట్ల అప్పులను ఎగ్గొడుతున్నప్పటికీ, చట్టాలు మరియు ట్రిబ్యునల్స్ వారికి అనుకూలంగా మారుతున్నాయని, ఇది వ్యవస్థాగత వైఫల్యానికి నిదర్శనమని విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు ఆరోపించారు.
Next Story




