News Analysis: తిరుచ్చి, శివమొగ్గలలో తాంత్రిక పూజలు? బీఆర్‌ఎస్ Vs కాంగ్రెస్ పొలిటికల్ వార్!

News Analysis: హరీష్ రావు క్షుద్ర పూజల వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు, కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు మరియు బీఆర్‌ఎస్ లీగల్ నోటీసులపై హెచ్‌ఎమ్‌టీవీ ప్రత్యేక న్యూస్ అనాలసిస్.

Arun Chilukuri
Published on: 5 Aug 2026 11:58 AM IST
News Analysis
X

News Analysis: తిరుచ్చి, శివమొగ్గలలో తాంత్రిక పూజలు? బీఆర్‌ఎస్ Vs కాంగ్రెస్ పొలిటికల్ వార్!

News Analysis: తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు తానీరు హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ గుప్పించిన "క్షుద్ర పూజల" ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, పంటలు ఎండిపోవాలని, తద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెడ్డపేరు రావాలనే దుర్బుద్ధితో హరీష్ రావు అఘోరాలు, తాంత్రిక గురువులతో క్షుద్ర పూజలు చేయిస్తున్నారంటూ టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి.

ఈ వ్యవహారంపై హెచ్‌ఎమ్‌టీవీ నిర్వహించిన "న్యూస్ అనాలసిస్" కార్యక్రమంలో తెలంగాణ లైవ్‌స్టాక్ ఏజెన్సీ చైర్మన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు పాల్గొని తమ విశ్లేషణను పంచుకున్నారు.

మార్చి 2న తమిళనాడులోని తిరుచ్చి అఘోర కాళీ ఆలయంలో, అలాగే జూలై 23న కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో హరీష్ రావు ప్రత్యేక తాంత్రిక పూజలు నిర్వహించారని కాంగ్రెస్ మీడియా కమిటీ ఆధారాలను బయటపెట్టిందని చరణ్ కౌశిక్ యాదవ్ తెలిపారు. హరీష్ రావుతో వెళ్లిన వారే ఈ సమాచారాన్ని అందించారని పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story