Jordar Varthalu: తరుణ్ బాస్కర్ చేసిన పనికి చిరాకు పడ్డ ట్రంప్!

Jordar Varthalu: తరుణ్ భాస్కర్ కొత్త సినిమా 'గాయపడ్డ సింహం' కోసం డొనాల్డ్ ట్రంప్‌తో AI వీడియో. ఇరాన్ టీ తాగి ట్రంప్ ఇచ్చిన రియాక్షన్ వైరల్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 April 2026 7:01 AM IST
Jordar Varthalu
X

Jordar Varthalu: తరుణ్ బాస్కర్ చేసిన పనికి చిరాకు పడ్డ ట్రంప్!

Jordar Varthalu: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తన సినిమాలతోనే కాదు, ప్రచారంతోనూ వైవిధ్యం చాటుకుంటారు. తాజాగా ఆయన తన కొత్త సినిమా "గాయపడ్డ సింహం" కోసం ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నే ప్రచారంలోకి దించి అందరినీ ఆశ్చర్యపరిచారు. AI (కృత్రిమ మేధస్సు) సాయంతో రూపొందించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది.

ఈ వీడియోలో ట్రంప్ మరియు తరుణ్ భాస్కర్ కలిసి టీ తాగుతూ కనిపిస్తారు. టీని ఎంజాయ్ చేస్తున్న ట్రంప్‌కు, అది ఇరాన్ టీ అని తరుణ్ చెప్పగానే ఆయన రియాక్షన్ చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. సినిమా ప్రమోషన్ కోసం AIని ఇంత చాకచక్యంగా వాడటం తరుణ్ భాస్కర్‌కే సాధ్యమని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రం మే 1న విడుదల కానుంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story