Jordar Varthalu: తేజస్వీ సూర్యను వాయించిన తెలంగాణ లీడర్లు!

Jordar Varthalu: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 April 2026 1:21 PM IST
Jordar Varthalu
X

Jordar Varthalu: తేజస్వీ సూర్యను వాయించిన తెలంగాణ లీడర్లు!

Jordar Varthalu: పార్లమెంట్‌లో కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజనను బ్రిటిష్ వారు చేసిన భారత్-పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ ఆయన చేసిన ప్రసంగంపై తెలంగాణ వాదులు, రాజకీయ నేతలు బగ్గుమంటున్నారు.

నేతల ఘాటు స్పందన:

కేటీఆర్ (KTR): తెలంగాణ రాష్ట్రం ఏర్పడడాన్ని భారత్-పాకిస్తాన్ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వం అని కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీకి తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని, ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

హరీష్ రావు: రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన తెలంగాణను కించపరచడం తగదని, నాడు విభజన బిల్లుకు బీజేపీ మద్దతు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తున్న రాష్ట్రాన్ని చూసి బీజేపీ తట్టుకోలేకపోతోందని విమర్శించారు.

కవిత: తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటాన్ని అవమానించే హక్కు ఎవరికీ లేదని కవిత అన్నారు. బీజేపీ ఎంపీలు వెంటనే తేజస్వీ సూర్యతో క్షమాపణ చెప్పించాలని, లేకపోతే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

పొన్నం ప్రభాకర్: పార్లమెంట్ సాక్షిగా తెలంగాణను అవమానిస్తుంటే రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story