Off The Record: తెలంగాణలో రెచ్చిపోతున్న అవినీతి అధికారులు
Off The Record: తెలంగాణలో అవినీతి అధికారుల గుండెల్లో యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) రైళ్లు పరిగెత్తిస్తోంది.
Off The Record: తెలంగాణలో రెచ్చిపోతున్న అవినీతి అధికారులు
Off The Record: బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగాన్ని.. అక్రమార్జనకు నెలవుగా మార్చుకుంటున్నారు తెలంగాణలో కొందరు అధికారులు. దొడ్డిదారిన సొమ్ము పోగేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. అవినీతికి కులం లేదు, మతం లేదు. చదువుకొని సంపాదించిన ఉద్యోగం ఇప్పుడు వారికి సిరులు కురిపిస్తోంది.
గ్రూప్-2 నుంచి మొదలు గ్రూప్-1, IASలతో పాటు ఇంజినీర్‌ల వరకు.., ఇలా ఉన్నతస్థాయిలో ఉన్న వారు కూడా లక్షల్లో జీతాలు తీసుకుంటూనే, అవి చాలదు అన్నట్టు అవినీతి, అక్రమాలకు చేతులు చాస్తూ కోట్లు కొల్లకొడుతున్నారు.
ఏసీబీ, ఇతర వర్గాల అంచానా ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగుల వద్ద అనధికారికంగా సంపాదించిన ఆస్తులు సుమారు లక్షా 50వేల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత..? ప్రతి రోజు పట్టుబడుతున్న అధికారుల ఆస్తులే ఇందుకు సాక్ష్యమా...? వాచ్ దిస్.




