Jordar News: ఒకవైపు వానలు లేవు.. ఇంకోవైపు రైతు భరోసా రాలేదు..

Jordar News: తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు! పత్తి విత్తనాలు వేసి పది రోజులు దాటినా మొలకెత్తని వైనం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 Jun 2026 7:22 AM IST
Jordar News
X

Jordar News: ఒకవైపు వానలు లేవు.. ఇంకోవైపు రైతు భరోసా రాలేదు..

Jordar News: ఆ పబ్లీకు రొండొద్దుల సంది పానం మంచిగలేదని మా ముసలోడు కొలువుకు గుండు సున్న పెట్టిండు మరి ఇయ్యాల్నన్న వార్త తీసుకత్తడొ అట్లనే కుసుకుస అని ముస్కుపెట్టి పన్నడో అర్సుకుందాం పార్రి.. తాత ఏం చేస్తున్నవే..

పానం మంచిగలేదని నడింట్ల మంచమేసుకొని మల్సుకొని పంటే ఎల్లేతట్టున్నాదిరా మన రైతుల బత్కు.. రెక్కాడ్తే కాని డొక్కాడది.. ఇత్తులు పెట్టి ఇన్నొద్దులైనా వాన సిన్కులు లేకా అవ్వి బూమిల్నే ముల్గ పట్టే ఏం చేత్తం ఏం కతా..

అగ్గొ పానం మంచిగలేదని అంటివి కాదే తాత.. ఈ ఎండల ఆ ఎవుసం పనులకు పోకుంటే ఏమైందే..

రాములు: అప్పు తెచ్చి పత్తిత్తులు పట్టుకచ్చిన్నే తల్లి.. అవ్వి పెట్టి వారం అయితంది.. అయిన ఇత్తు మొల్కెత్తలేదు.. ఇట్లనే ఇడ్సిపెడ్తే ఎట్లా.. అందుకే మొగుల్కు దండం పెట్టి లోటలందుకొని నీల్లు పోత్తున్న ఏం చెయ్యాలే..

అప్పు చేసి ఇత్తునాలు తెచ్చినా అంటున్నవ్.. సర్కారు పంటసాయంగ రైతు బరోసా ఏత్తది కాదే.. ఎయ్యలేదా ఇంకా..

సర్కారు రైతు బరోసా ఏత్తే మీ టీవిలొల్లకు తెల్వకుంటనే ఏత్తండానే.. ముక్యమంత్రి సారు పంటసాయం ఏసినప్పుడాల్ల బైరంగ సబలు పెట్టి రైతులకు రైతు బరోసా బిచ్చం ఏత్తున్న ఏత్తున్న అని చెప్పుతడు కాదు పిల్లా.. ఈ నడ్మా అసొంటి మీటింగులు పెట్టలేదు అంటే ఎయ్యలేదు అన్నట్టే కదా..

అవును అది కరక్టే కని.. కాలం నడినెత్తిమీదికి వచ్చింది కాబట్టి ఈ నెలాఖరుకు ఏత్తమంటున్నరే రైతుబరోసా పైసలు..

ఏమేసుడు వాల్ల ఏసుడు సెర్ల చేరా.. పోయిన సారి పంటసాయం కింద ఏసిన పైసలే రొండెకురాలు దాటలేదు.. ఇగ ఇప్పుడు మల్ల ఏసుడు మొదలు పెడ్తే కడ్మ మిగిలిన రైతులకు ఏసి చేతులు దుల్పుకుంటరు కావచ్చు..

సరే ఆ రైతు బరోసా పైసల ముచ్చట పక్కకు పెట్టుకని.. ఇప్పుడు ఆ మొల్కలకు నీల్లెందుకు పోత్తున్నవ్ చెప్పు..

అరే దీని కండ్లు కాకులు గద్దలు పొడ్సుకతిన్నయారా రాజాలు.. పత్తిత్తులు పెట్టి పదొద్దులు అయితున్నది అయిన వాన సిన్కులు లేకా మొల్కెత్తలేదే అంటెనొ మల్ల నీల్లెందుకు పోత్తున్నవ్ అంటదేంరా..

అదే ముసలోడా.. ఇయ్యాల్నొ రేపో వానలు పడక పోవునా.. గంతగనం కూలోల్లను పెట్టి నీల్లు పొయ్యాల్సిన అవుస్రం ఏమున్నది అంటున్నా..

అమ్మా తిప్పులాడి వేసిల రూంల కూసొని రాసిచ్చిన వార్తలు సద్వే నీకు ఎవుసం గురించి తెల్వది.. మొన్న పడ్డ నాల్గు వాన సిన్కులకే అప్పలు తెచ్చి పత్తిత్తులు కొన్కచ్చి పెట్టినం... పెట్టినంక వానలు పడ్తలెవ్వు, అవ్వి మొల్కెత్తులెవ్వు ఏం చెయ్యాలే చెప్పు.. అందుకే కూలొల్లను పెట్టి లోటలతోని నీల్లు పోత్తున్నం..

ఇయ్యేడు వానలు పడేతట్టే కానత్తలెవ్వాటనే తాత.. అదేందొ ఎల్ నీనొ ప్రబావం చేయబట్టి ఎండలె ఎక్కువున్నయాట..

అందుకే సర్కారు ముందుగాలనే చేతులు దుల్పుకుంటున్నది.. ఇయ్యేడు వానలు పడేతట్టు లెవ్వు కాబట్టి రైతులు సిన్నసిన్న పంటలే ఏసుకోవాలే అని అదేందొ అడివిడిలల్ల చూపెడ్తున్నరు కదా..

అవును.. అందుకే నీటి అవుస్రం తక్కువుండే పంటల్నే ఏసుకోర్రే..

చెప్పుమంటే పొద్దంత కొలుపు పెట్టి చెప్పుతరు కని.. ముందుగాల సర్కారు చేసే పంట సాయాన్ని జెల్లిన చెయ్యిమను.. అయిన కాలమే అయితలేదు పంట సాయం ఎందుకు చేసుడు అంటరు కావచ్చురా..

అవునే తాత కాలంకాకా పంటలే ఏత్తలేరాయే ఇంక పంట సాయం ఎందుకు అంటరు కావచ్చునే..

కాలం కాకున్నా అప్పుడొ ఇఫ్పుడొ పడే వానలకైనా ఏసే పంటలు ఉంటయ్ కాదే.. వాటికోసమైన సర్కారు పంట సాయం ఎయ్యాలే కదా..

ఎయ్యాలే కని సర్కారుకు ఆ సోయి ఉండాలే కదా.. అయినా నాదొ డఫ్టు పిల్లా.. కాలం కాకున్న మీది దిక్కు పడ్డ వానలకు కాలేశ్వరం రిండుతది కదా.. ఆ కాలువలతోని మాకు నీల్లు అందియ్యచ్చు కదా.. సర్కారు ఆ పని చేత్తదంటవా..

అది కాలేశ్వరం కాదు కూలేశ్వరం అని బదునాం చేసిన సర్కారు ఆ కాలేశ్వరాన్ని ఉపయోగించుకుంటదనే నమ్మకమైతే నాకు లేదే తాత..

నువ్వన్నది కూడా నిజమే పిల్లా..

ఓ నిజం.. యాల్లయ్యింది నీను పోతానా..

ఓరిత్తా.. ఏడికిరా పోయ్యేది.. వచ్చి రొండు గంటలు కూడా అయితలేదు, రొండు బకిట్లు కూడా మొయ్యలేదు కాదురా..

ఏ నువ్విచ్చే కూలికి ఎన్ని బకిట్లు మొయ్యాలే, ఏ యాల్లదాకా పని చెయ్యాలే నీను పోతానా..

ఓ అన్నా.. మా తాత ఒక్కడే ఏం చేత్తడే.. జెర్రసేపుండి ఆసర కారాదే పున్నెముంటది..

ఏ వాన్నెందుకు బతిలాడుతున్నవ్ పిల్లా కూలి తీసుకుంటలేడా లేకిడోడు..

ఏ ముసలోడా లేకిడోడా గీకిడోడా అని మాట్లాడకు మక్కులు సాపైతయ్..

ఏందిరా మక్కులు సాపయ్యేది.. మాపటాల్లకు పోత్తే పొక్కపల్గ తాగినవ్.. మల్ల పొద్దుగాల అక్కెరున్నయ్ అని ఐదువందలు అడ్కున్నవ్.. ఇప్పుడు మక్కులు సాపతయ్ అని బెదిరిత్తున్నవ్ ఏందిరా బాడ్కావ్..

నీ పైసలియ్య ఏమియ్య ఏం పీక్కుంటవొ పీక్కొ పో..

అయ్యిందా.. మంచిగయ్యిందా.. కూలికచ్చినోన్ని బతిలాడి పని చేయించుకోవాలే కని.. గిట్ల మాటలని, చెయ్యిచేసుకుంటే ఊకుంటారే..

లోకమే అట్ల తయ్యారైందే తల్లి ఏం చేత్తం.. సరే కని ఓ పిల్లా ఇయ్యాల్నొ రేపొ రైతు బరోసా పైసలు పడ్తయంటవా.. అవ్వి పడ్డా మల్ల పత్తిత్తులు కొన్కచ్చుకొని వానసిన్కులు పడ్తే పెడ్దునే.. ఇవ్వి మొల్వకుంటే ఇగ నా గతి సిప్పచేతపట్టి గుడిమెట్ల కాడ కూసునుడే అయితది.. వీడెటుపాయే ఓరజియే..

సర్కార్ ఈపారి రైతు భరోసా పైసలు అందర్కి ఏస్తడాటనే తాత. నువ్వేం రంది పడకు. పదిరోజుల్లనే మొత్తం మంది రైతులకు రైతుభరోసా ఎయ్యాల్నని పిలాన్లు ఏస్తున్నది సర్కారు. మరిగ రైతులూ.. ఈయేడు వర్షాలు తక్కో వడేతట్టున్నయని వాతావరణ శాఖోల్లు జెప్తున్నరు. ఇగటు ఎవుసం శాఖ అధికారులేమో.. వరి ఎయ్యకుంట తక్కో నీళ్లతోని పండే పంటలే ఏస్కోవాలే. లేకుంటె పంట ఆఖరుకచ్చే వరకు ఇబ్బంది వడాల్సి అత్తదని అంటున్నరు. కావట్టి., జర్ర సూస్కోని పంటలేస్కోండ్రి. అటెంక ఇబ్బంది వడకుర్రి. సరేనా.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story