Off The Record: మా నేతకు మంత్రి పదవి ఇవ్వండి.. అనుచరుల ఆవేదన
Off The Record: ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో ముదిరిన మంత్రి పదవి లొల్లి. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్సెస్ మంత్రి వివేక్. కేబినెట్ విస్తరణలో పీఎస్ఆర్‌కు చోటు దక్కుతుందా? మంచిర్యాల ఎమ్మెల్యే పట్టుదలపై ప్రత్యేక కథనం.
Off The Record: మా నేతకు మంత్రి పదవి ఇవ్వండి.. అనుచరుల ఆవేదన
Off The Record: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవిపై ఉత్కంఠ నెలకొంది. జిల్లా కోటాలో ఆ పదవి ఎవరిని వరిస్తుందనే విషయంలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. మంచిర్యాల ఎమ్మెల్యే, సీనియర్ లీడర్ ప్రేంసాగర్ రావుకే కేబినెట్ బెర్త్ దక్కుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఎన్నికల ముందు వేరే పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మంత్రి పదవి దక్కించుకున్నారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా మంది కాంగ్రెస్ మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్లుగా పార్టీకి అండగా ఉన్న ప్రేంసాగర్ రావుకు కాదని వివేక్ కు పదవి ఎట్లా ఇస్తారని నిలదీశారు. అదే సమయంలో కేబినెట్ పోస్టు దూరం కావడంతో ఇటు ప్రేమ్ సాగర్ కూడా తీవ్రంగా నొచ్చుకున్నారు. పార్టీకి లాయల్టీగా ఉన్నందుకు మీరిచ్చే గౌవరం ఇదేనా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఐతే మంత్రి స్థానానికి బదులు.. ప్రేంసాగర్ రావుకు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టి బుజ్జగించే ప్రయత్నం చేసింది రాష్ట్ర నాయకత్వం. కానీ అందుకు ససేమిరా అన్నారు ప్రేమ్‌సాగర్. ఇస్తే మంత్రిపదవి ఇవ్వండి లేకుంటే ఏ పదవీ వద్దు అన్నట్టు కాంగ్రెస్ నిర్ణయాన్ని తిరస్కరించారు.
మంత్రి అనిపించుకోవాలని మొదటి నుంచి పట్టుదలతో ఉన్న ప్రేంసాగర్ రావు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతల్ని తీసుకోలేదు. తనకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవే కావాలంటూ పట్టుబట్టి కూర్చుకున్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉనికిని కోల్పోయే స్థాయికి చేరి పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌ను.. ఉమ్మడి జిల్లాలో గట్టెక్కించిది ఎవరంటే ప్రేమ్ సాగర్ రావు పేరే వినిపిస్తుంది. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి మొదటి సభ ఇంద్రవెల్లిలో పెట్టారు. ఆ దండోరా సభను విజయవంతం చేసి, రేవంత్‌రెడ్డితో శభాష్ అనిపించుకున్నారు ప్రేమ్‌సాగర్. పిప్పిరి నుంచి భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభిస్తే ఆ యాత్ర సక్సెస్ చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ బతికే ఉందనే సంకేతాలను పంపించగలిగారు. సభలు, పాదయాత్రలు, రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి దండోరా కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలు ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహాలు లేవు. ఇలా ఉమ్మడి జిల్లాలో ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారనే పేరు తెచ్చుకున్నది పీఎస్ఆర్.
ప్రస్తుతం తనకు ఆరోగ్యం బాగలేకపోయినా, మంచిర్యాల అభివృద్ధి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారట ప్రేమ్‌సాగర్‌రావు. పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి పనులు చేస్తున్నారు. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వకపోవడం ఏమిటనే ప్రశ్నలు కేడర్‌లో లేవనెత్తుతున్నాయి. పార్టీ కోసం కష్టపడిన వారికి ఇవ్వకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన సమావేశాల్లో ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్టు... ఏదైనా పదవిలో ఐదేండ్లు ఉంటే వారు తప్పుకోవాలని నిర్ణయాలు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఆ నిర్ణయాలు కాదని మరీ పార్టీ మారి వచ్చిన వివేక్‌కు మంత్రి పదవి ఇచ్చారు. అయితే, ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం అనుకూలంగానే ఉన్నారు. చివరికి AICC సైతం ప్రేమ్ సాగర్ విషయంలో సానుకూలంగానే ఉంది. అయితే ఇక్కడ సామాజిక సమీకరణాలు.. స్థానిక పరిస్థితులను బేరీజు వేసుకుని CM రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు.
తెలంగాణ మంత్రివర్గంలో 18 మందికి అవకాశం ఉండగా, ప్రస్తుతం ముఖ్యమంత్రితో పాటు 16 మంది మంత్రులే ఉన్నారు. సర్కార్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు పూర్తైనా ఇప్పటికీ మరో రెండు స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. దీంతో ఆ రెండు ఖాళీలను కూడా భర్తీ చేయాలని అధిష్ఠానం నిర్ణయించింది. కానీ ఎవరెవరిని ఎంపిక చేయాలనే చిక్కుముడి వల్ల.. పార్టీ ఓ నిర్ణయానికి కాలేకపోతుంది. మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న నేతల జాబితా పెద్దదిగా ఉండటం.. పైగా జిల్లా, సామాజిక సమీకరణాల దృష్యా పార్టీ ఏటూ తేల్చకోలేకపోతుంది. కేబినెట్‌లో ప్రస్తుతం లంబాడా సామాజికవర్గానికి ప్రాతినిత్యం లేదు. దీంతో ఆ క్యాస్ట్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇక పార్టీలో సీనియర్లుగా చెప్పుకునే మల్‌రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వంటి లీడర్లు సైతం మంత్రివర్గంలో చోటుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే ఆధిష్టానం ఆలోచనలు, లెక్కలు ఎలా ఉన్నా.. ప్రేమ్‌సాగర్ రావుకు మంత్రివర్గంలో చోటు అనేది.. న్యాయమైన డిమాండ్‌గా చెప్తున్నారు ఆయన అనుచర వర్గాలు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న నేతల్ని కాదని.. తీరా ఎన్నిక టైంలో పార్టీలో జాయిన్ ఐన వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం, అదీ ఒక్క కుటుంబానికే రెండు, మూడు పోస్టులు ఇవ్వడం భావ్యం కాదు అంటున్నారు. ఇంకా మిగిలి ఉన్న రెండు స్థానాల్లోనైనా ప్రేమ్‌సాగర్ రావుకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ కొంత వెనకబడ్డట్టే ఉంది. ఇక్కడ బీజేపీ జోరు చూపిస్తున్న తరుణంలో.. మరో మంత్రి పదవి ఇవ్వడం తప్పేం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయట. మరి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రేంసాగర్ రావుకు పదవి దక్కుతుందా..? లేదా....? వేచి చూడాలి మరి.
మంత్రి అనిపించుకోవాలని మొదటి నుంచి పట్టుదలతో ఉన్న ప్రేంసాగర్ రావు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతల్ని తీసుకోలేదు. తనకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవే కావాలంటూ పట్టుబట్టి కూర్చుకున్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉనికిని కోల్పోయే స్థాయికి చేరి పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌ను.. ఉమ్మడి జిల్లాలో
గట్టెక్కించిది ఎవరంటే ప్రేమ్ సాగర్ రావు పేరే వినిపిస్తుంది. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి మొదటి సభ ఇంద్రవెల్లిలో పెట్టారు. ఆ దండోరా సభను విజయవంతం చేసి, రేవంత్‌రెడ్డితో శభాష్ అనిపించుకున్నారు ప్రేమ్‌సాగర్. పిప్పిరి నుంచి భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభిస్తే ఆ యాత్ర సక్సెస్ చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ బతికే ఉందనే సంకేతాలను పంపించగలిగారు. సభలు, పాదయాత్రలు, రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి దండోరా కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలు ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహాలు లేవు. ఇలా ఉమ్మడి జిల్లాలో ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారనే పేరు తెచ్చుకున్నది పీఎస్ఆర్.