News Analysis: ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులా? బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై బీజేపీ ఫైర్!

News Analysis: తెలంగాణలో అప్పుల పంచాయితీపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 4 July 2026 11:34 AM IST
News Analysis
X

News Analysis: ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులా? బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై బీజేపీ ఫైర్!

News Analysis: తెలంగాణ రాష్ట్ర అప్పుల వివాదంపై అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తుండగా, ఈ వ్యవహారంలోకి బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. హెచ్‌ఎమ్‌టీవీ (hmtv) డిబేట్‌లో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ రాష్ట్ర అప్పుల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన ఉభయ పార్టీలు.. రాష్ట్రంలో చేసిన ‘ఆస్తుల సృష్టి’ ఏంటని ప్రశ్నించారు.

ప్రస్తుత ప్రభుత్వం చెప్తున్న ₹8,21,000 కోట్ల అప్పుల లెక్కలపై బీఆర్ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై యెండల లక్ష్మీనారాయణ స్పందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేరుగా తెచ్చిన అప్పులతో పాటు సింగరేణి, జెన్‌కో, ఆర్టీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వం కౌంటర్ గ్యారెంటీ ఇచ్చి అప్పులు తెచ్చిందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని మెట్రో వాటర్ వర్క్స్ ఆస్తులను, ఆర్టీసీ, సింగరేణి ఆస్తులను తాకట్టు పెట్టి కార్పొరేషన్ల ద్వారా నిధులు సమీకరించారని, అందుకే ఇప్పుడు ఆ అప్పులన్నీ ఎఫ్‌ఆర్‌బీఎమ్ (FRBM) పరిధిలోకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో చేరాయని వివరించారు. కొత్త ఆస్తులను సృష్టించాల్సింది పోయి, ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టడం ఏ రకమైన ఆర్థిక క్రమశిక్షణ అని ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story