New Analysis: అసెంబ్లీకి రండి.. తేల్చుకుందాం: బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ సవాల్!

New Analysis: తెలంగాణలో రాజకీయ వాతావరణం ‘అప్పుల పంచాయితీ’ చుట్టూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Arun Chilukuri
Published on: 4 July 2026 11:23 AM IST
New Analysis
X

New Analysis: అసెంబ్లీకి రండి.. తేల్చుకుందాం: బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ సవాల్!

New Analysis: తెలంగాణలో రాజకీయ వాతావరణం ‘అప్పుల పంచాయితీ’ చుట్టూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర అప్పులపై బీఆర్ఎస్ శ్వేతపత్రాలు, పవర్‌పాయింట్ ప్రజంటేషన్లతో (PPT) అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తుండగా.. కాంగ్రెస్ శ్రేణులు అంతే బలంగా కౌంటర్ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్‌ఎమ్‌టీవీ (hmtv) ప్రత్యేక చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు, తెలంగాణ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చైర్మన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ బీఆర్ఎస్ వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

బీఆర్ఎస్ నేతలు బయట ప్రెస్‌మీట్లు, పీపీటీలు పెట్టడం కాదని.. దమ్ముంటే అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. "ప్రశ్నలు మీవి.. సమాధానాలు మావి" అంటూ అధికార పక్షం తరఫున స్పష్టమైన స్పష్టత ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై తప్పుడు లెక్కలు ప్రచారం చేస్తున్నారని చరణ్ కౌశిక్ యాదవ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీ వేదికగానే శ్వేతపత్రం విడుదల చేసిందని ఆయన గుర్తుచేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story