News Analysis: తెలంగాణలో తీవ్ర కరువు: సీఎం రేవంత్ రెడ్డి పంతం వీడి కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలి: బీఆర్ఎస్!
News Analysis: తెలంగాణలో ఎల్ నినో ఎఫెక్ట్, తీవ్ర కరువు పరిస్థితులపై హెచ్ఎంటీవీ న్యూస్ అనాలసిస్లో బీఆర్ఎస్ నేత దిలీప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.
News Analysis: తెలంగాణలో తీవ్ర కరువు: సీఎం రేవంత్ రెడ్డి పంతం వీడి కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలి: బీఆర్ఎస్!
News Analysis: ఎల్ నినో ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కొంటోంది. దేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం, అతి తక్కువ నీటి నిల్వలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమీక్షా నివేదిక హెచ్చరించింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుపడుతూ 'హెచ్ఎంటీవీ' (hmtv) న్యూస్ అనాలసిస్ వేదికగా బీఆర్ఎస్ నాయకుడు దిలీప్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కేంద్ర జలశక్తి శాఖ నివేదిక ప్రకారం.. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో కేవలం 41 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉంది. ఇందులో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులలో 14 టీఎంసీలు, గోదావరి బేసిన్ ప్రాజెక్టుల పరిధిలో 27 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఈ నీరు కేవలం తాగునీటి అవసరాలకే సరిపోతుందని, సాగునీటికి ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. నీటి కొరత కారణంగా రాష్ట్రంలో నార్లు ముదిరిపోతున్నా రైతులు వరి వేయలేని దారుణ పరిస్థితులు నెలకొన్నాయని దిలీప్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలాంటి కరువు సమయంలో అందుబాటులో ఉన్న వనరులను వాడుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ బేషజాలకు పోతున్నారని బీఆర్ఎస్ నేత విమర్శించారు. ఎన్నికల్లో కాళేశ్వరం కూలిపోయిందంటూ దొంగ ప్రచారం చేసి గెలిచారని, ఇప్పుడు అక్కడ మోటార్లు ఆన్ చేస్తే ప్రాజెక్ట్ బాగుందనే నిజం బయటపడుతుందనే భయంతోనే ప్రభుత్వం వెనకాడుతోందని ఆరోపించారు. కన్నెపల్లి (మేడిగడ్డ) వద్ద నీటి మట్టం 93.5 మీటర్లకు చేరినప్పుడు మోటార్లు ఆన్ చేసి సులభంగా నీటిని ఎత్తిపోసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం గనుక సకాలంలో స్పందించి ఉంటే ఈ కరువు కాలంలో కనీసం 20 నుండి 25 టీఎంసీల నీటిని నింపుకుని రైతులను ఆదుకునే అవకాశం ఉండేదన్నారు.




