Jordar News: ఏం బుర్ర రా నాయనా..
Jordar News: కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక రైతు తన ట్రాక్టర్ ట్రాలీని స్విమ్మింగ్ పూల్‌గా మార్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Jordar News: ఏం బుర్ర రా నాయనా..
Jordar News: వారెవ్వా.. అన్న ఆలోశన శిన్నగ లేదు గదా. ఎర్రటి ఎండల్ల.. మంచుగుట్టల మీద ఎగ్రినసొంటి ఉపాయం జేశిండు గదా. ఇంటి ముంగట స్విమ్మింగ్ పూలంటే తక్వ పైసలు కావు. తీర్పాటంగ కట్టిచ్చుడు, దాంట్ల నీళ్లు మార్సుడు, కరావ్ గాకుంట సూసుకునుడు, మనసొంటోల్లతోని అది అయ్యేపని కానే కాదు. కనీ.. అసొంటి అసాధ్యాన్ని సుసాధ్యం జేశి సూపెట్టిండు గీ రైతన్న. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కూనవానిపల్లెల ఉంటడు. పేరు యాదగిరి. ఈయ్నకు ఓ ట్రాక్టరున్నదట. ఎర్రటి ఎండలకు పిలగాండ్లు నిమ్మలంగ ఇంటికాన్నే జలకాలు ఎట్ల ఆడాల్నని బగ్గ ఆలోశన జేశిండు. ఇగ కల్లాలు లేశ్నంక ట్రాక్టర్లు రికాముండుడేనాయె.. ఉత్తగ ట్రాక్టర్ డబ్బను రికాం ఎందుకు ఉంచుడని, ఉన్నదాంతోనే స్విమ్మింగ్ పూల్ తయార్జేశే ఉపాయం జేశిండు. దాంట్ల ఓ పర్ద వర్శి నీల్లు నింపి, పిలగాండ్లను అండ్ల ఏస్తే.. మస్తుగ ఎంజాయ్ జేస్తున్నరట గిప్పుడు.
కెనాల్ల పొంటి పొయ్యి పానాలు పర్శాన్ల పడేసుకోవద్దని గీ ఉపాయం జేశిండట. ఇగట్లనే సర్కార్ గుడ మండలానికో స్విమ్మింగ్ పూల్ కడ్తె.. పిలగాండ్ల సావు వార్తలు ఇనుడు బందైతదని అంటున్నడు. మరి మంచి ముచ్చట్లు సర్కారోల్లు ఎందుకు పట్టిచ్చుకుంటరు కని, రైతన్న ఇన్నోవేషన్ మాత్రం సూపరో సూపర్ అనుకుంట తారీఫ్ జేస్తున్నరు ఇంటర్నెట్ల ఈ వైరలైతున్న వీడియోను సూశ్న జనాలు. ఏమాటకామాటనే కనీ., ఉన్నంతల కొత్త కొత్తయి కనిపెట్టుట్ల రైతన్నల తర్వాతనే ఎవ్వలైనా పోండ్రి.




