News Analysis: ₹8500 కోట్ల బకాయిలు పెట్టింది BRS కాదా?.. విపక్షాలకు కాంగ్రెస్ గట్టి కౌంటర్!
News Analysis: గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తీరుస్తూ, విద్యార్థుల ఖాతాల్లోకే నేరుగా నిధులు జమ చేస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత గౌరి సతీష్ తెలిపారు.
News Analysis: ₹8500 కోట్ల బకాయిలు పెట్టింది BRS కాదా?.. విపక్షాలకు కాంగ్రెస్ గట్టి కౌంటర్!
News Analysis: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలనపై బిఆర్ఎస్, బీజేపీలు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌరి సతీష్ తీవ్రంగా తిప్పికొట్టారు. hmtv న్యూస్ ఎనాలసిస్ డిబేట్‌లో పాల్గొన్న ఆయన, విపక్షాలు అసత్య ప్రచారాలు మాని అసెంబ్లీ చర్చలకు రావాలని సవాల్ విసిరారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు ₹8,500 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పెండింగ్‌లో పెట్టిందని గౌరి సతీష్ ఆరోపించారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన దాదాపు 12,56,500 మంది అర్హులైన విద్యార్థులను గుర్తించిందని తెలిపారు. కేంద్ర నిబంధనల ప్రకారం ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లోనే ₹24,300 కోట్లను నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే అడ్వాన్స్‌గా జమ చేయబోతున్నామని స్పష్టం చేశారు.




