News Analysis: రేవంత్ పాలనలో సర్టిఫికెట్లకు మనీ డిమాండ్.. BRS నేత చిరుమల్ల రాకేష్ సంచలన వ్యాఖ్యలు!
News Analysis: ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు రాక యూనివర్సిటీల్లో విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నారని బిఆర్ఎస్ నేత చిరుమల్ల రాకేష్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
News Analysis: రేవంత్ పాలనలో సర్టిఫికెట్లకు మనీ డిమాండ్.. BRS నేత చిరుమల్ల రాకేష్ సంచలన వ్యాఖ్యలు!
News Analysis: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ (BRS) సీనియర్ నాయకులు డాక్టర్ చిరుమల్ల రాకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "కెసిఆర్ పాలన ఫ్యామిలీ జస్టిస్ అయితే.. నాది సోషల్ జస్టిస్, అసెంబ్లీలో చర్చకు సిద్ధం" అని సీఎం రేవంత్ రెడ్డి విసురుతున్న సవాళ్లకు సమాధానంగా, క్షేత్రస్థాయిలో ప్రజా సంక్షేమ పథకాలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని చిరుమల్ల రాకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలైన మహిళా యూనివర్సిటీ (చాకలి ఐలమ్మ యూనివర్సిటీ) వంటి విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో, విద్యార్థులు జేబుల నుంచి ఫీజులు చెల్లిస్తే తప్ప సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యకు (MBA వంటి కోర్సులు) దూరమవుతున్నారని ఎత్తిచూపారు.




