News Analysis: కేసీఆర్ పాపాల వల్లే తిప్పలు.. ఏటా ₹70 వేల కోట్ల వడ్డీలు కడుతున్నాం: ఇందిరా శోభన్!
News Analysis: తెలంగాణ రాష్ట్రాన్ని గత కేసీఆర్ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పుల ఊబిలోకి నెట్టేయడం వల్లే ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ మండిపడ్డారు.
News Analysis: కేసీఆర్ పాపాల వల్లే తిప్పలు.. ఏటా ₹70 వేల కోట్ల వడ్డీలు కడుతున్నాం: ఇందిరా శోభన్!
News Analysis: తెలంగాణ రాష్ట్రాన్ని గత కేసీఆర్ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పుల ఊబిలోకి నెట్టేయడం వల్లే ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ మండిపడ్డారు. హెచ్ఎంటీవీ (hmtv) ప్రత్యేక చర్చా వేదికగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పుల కారణంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం వడ్డీల (మిత్తిల) రూపంలోనే ఏటా ₹70,000 కోట్లు చెల్లించాల్సి వస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సాగు సీజన్ (ఏరువాక) ప్రారంభమైన నేపథ్యంలో రైతన్నకు పెట్టుబడి సహాయం అందించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹9,000 కోట్ల విడుదలకు శ్రీకారం చుట్టారని ఇందిరా శోభన్ తెలిపారు. మొదటి విడతగా ఇప్పటికే ₹2,000 కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయని, రాబోయే 9 రోజుల్లో మిగతా మొత్తం రైతుల ఖాతాల్లో జమ అవుతుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం సాగు చేయని కొండలు, గుట్టలు, రాళ్లకు రప్పలకు కూడా దాదాపు ₹18,000 కోట్ల రైతు బంధు నిధులు దుర్వినియోగం చేసిందని, కానీ తమ ప్రభుత్వం కేవలం అర్హులైన రైతులకే నిధులు అందేలా చూస్తోందని వివరించారు.




