News Analysis: ఆర్బీఐ నుంచి అప్పు తెచ్చి ‘రైతు భరోసా’ ఇస్తున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేత మహేష్ తీవ్ర విమర్శలు!

News Analysis: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు అరిగోస పడుతున్నారని..

Arun Chilukuri
Published on: 1 July 2026 12:08 PM IST
News Analysis
X

News Analysis: ఆర్బీఐ నుంచి అప్పు తెచ్చి ‘రైతు భరోసా’ ఇస్తున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేత మహేష్ తీవ్ర విమర్శలు!

News Analysis: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు అరిగోస పడుతున్నారని, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టర్లీ ఫెయిలైందని బీజేపీ సీనియర్ నాయకులు మహేష్ ధ్వజమెత్తారు. హెచ్ఎంటీవీ (hmtv) ప్రత్యేక చర్చా వేదికగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మరియు సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి "నా దగ్గర డబ్బుల్లేవు, బయట అప్పులు పుట్టట్లేదు, నన్ను దొంగల్లా చూస్తున్నారు" అని మాట్లాడుతున్న మాటలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని మహేష్ ఆరోపించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తెలంగాణకు నిధులు ఇస్తోందని, నిన్ననే ఆర్బీఐ నుంచి ₹7,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఈరోజు అరకొరగా రైతు భరోసా నిధులు వేస్తున్నారని మండిపడ్డారు. ఈ త్రైమాసికంలో ప్రభుత్వం మొత్తం ₹28,000 కోట్ల అప్పు తీసుకోబోతోందని ఆర్బీఐ డేటాను ఆయన ఉటంకించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story