మ్యాపింగ్ కాని ఓటర్ల పరిస్థితి ఏంటి? డ్రాఫ్ట్ జాబితా, అభ్యంతరాల నమోదుకు కీలక తేదీలివే!
తెలంగాణలో మ్యాపింగ్ కాని ఓటర్ల పరిస్థితిపై క్లారిటీ. ఆగస్టు 17న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల, సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు తెలపడానికి ఈసీ అవకాశం.
మ్యాపింగ్ కాని ఓటర్ల పరిస్థితి ఏంటి? డ్రాఫ్ట్ జాబితా, అభ్యంతరాల నమోదుకు కీలక తేదీలివే!
తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో మ్యాపింగ్ కాని ఓటర్లు, నమోదు సరిగ్గా జరగని వారి భవిష్యత్తుపై ఎన్నికల సంఘం స్పష్టమైన ప్రక్రియను వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో ఎన్యూమరేషన్ ఫారాలు వెనక్కి రాని వారు మరియు మ్యాపింగ్ కాని వారి పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సేకరించిన నివేదికల ప్రకారం దాదాపు 40 లక్షల ఎన్యూమరేషన్ ఫారాలు ఇంకా అన్‌కలెక్టబుల్ జాబితాలోనే ఉన్నాయి. చనిపోయిన వారు, డూప్లికేట్ ఓటర్లు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయిన వారు ఇందులో ప్రధానంగా ఉన్నారు. ఈ తనిఖీల వల్ల హైదరాబాద్‌లో ఏకంగా 25 లక్షల వరకు ఓట్లు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉప్పల్, వరంగల్, సికింద్రాబాద్, మంచిర్యాల, కంటోన్మెంట్ తదితర నియోజకవర్గాల్లో 20% నుంచి 28% వరకు ఓట్లు తగ్గుతున్నట్లు సమాచారం.




