BIG Debate: ఓటర్ల సవరణ (SIR) ప్రక్రియ: ఆ ఓట్లే ఎక్కువగా తొలగిపోతున్నాయి.. బీజేపీ నేత తాడూరి శ్రీనివాస్!

BIG Debate: తెలంగాణలో ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో ఎవరి ఓట్లు ఎక్కువగా తొలగిపోతున్నాయి? BLOల సర్వే, డబుల్ ఓట్లు, ప్రజా స్పందనపై బీజేపీ నేత తాడూరి శ్రీనివాస్ విశ్లేషణ.

Arun Chilukuri
Published on: 8 Aug 2026 11:33 AM IST
BIG Debate
X

BIG Debate: ఓటర్ల సవరణ (SIR) ప్రక్రియ: ఆ ఓట్లే ఎక్కువగా తొలగిపోతున్నాయి.. బీజేపీ నేత తాడూరి శ్రీనివాస్!

BIG Debate: తెలంగాణ వ్యాప్తంగా సాగుతున్న ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా లక్షలాది ఓట్లను జాబితా నుంచి తొలగించడాన్ని బీజేపీ నేత తాడూరి శ్రీనివాస్ విశ్లేషించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో ఎదురవుతున్న సమస్యలు, ఎవరి ఓట్లు ఎక్కువగా చెల్లకుండా పోతున్నాయి అనే అంశాలపై ఆయన స్పందించారు.

ఓటర్ల సర్వే కోసం ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగులను బిఎల్ఓ (BLO)లుగా నియమించారని తాడూరి శ్రీనివాస్ తెలిపారు. అయితే ఆశా వర్కర్లకు వ్యాక్సినేషన్ వంటి ఇతర బాధ్యతలు కూడా ఉండటంతో సర్వే నిర్వహణలో కొంత గందరగోళం ఏర్పడిందన్నారు. తప్పుడు ఇంటి నంబర్లు, కరెంట్ స్తంభాల నంబర్లపై వందలాది ఓట్లు నమోదై ఉండటం, ఇళ్లు దొరక్కపోవడం వంటి సమస్యల వల్ల BLOలు నేరుగా ఇంటింటికి తిరగలేకపోయారని చెప్పారు. దీంతో చాలా ప్రాంతాల్లో వార్డు ఆఫీసులు, కాలనీ సంక్షేమ సంఘాల హాల్స్‌లోనే ఫారాల సేకరణ చేపట్టారని పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story