News Analysis: తెలంగాణకు ఎల్ నినో భయం లేదు.. కాళేశ్వరాన్ని కేసీఆర్ పిచ్చి తుగ్లక్‌లా మార్చారు: కాంగ్రెస్!

News Analysis: తెలంగాణలో ఎల్ నినో ఎఫెక్ట్, తీవ్ర నీటి కొరతపై హెచ్‌ఎంటీవీ న్యూస్ అనాలసిస్‌లో కాంగ్రెస్ నేత జితేంద్ర వివరణ.

Arun Chilukuri
Published on: 17 July 2026 12:57 PM IST
News Analysis
X

News Analysis: తెలంగాణకు ఎల్ నినో భయం లేదు.. కాళేశ్వరాన్ని కేసీఆర్ పిచ్చి తుగ్లక్‌లా మార్చారు: కాంగ్రెస్!

News Analysis: ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని అతలాకుతలం చేస్తున్న 'ఎల్ నినో' ప్రభావం తెలంగాణపై కూడా తీవ్రంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 10 లోటు వర్షపాత రాష్ట్రాల అలర్ట్ జాబితాలో తెలంగాణ కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న నీటి లభ్యత సంక్షోభం, పంటల సాగు మరియు కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్ల నిర్వహణపై 'హెచ్‌ఎంటీవీ' (hmtv) న్యూస్ అనాలసిస్ వేదికగా కాంగ్రెస్ నాయకుడు జితేంద్ర లైవ్‌లో పలు కీలక నిజాలను వెల్లడించారు.

డిబేట్‌లో జితేంద్ర మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, కేవలం 9 రోజుల్లోనే రూ. 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో వేసిందని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం సముద్రంలో 14,500 కిలోమీటర్ల మేర విస్తరించిన ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గి నీటి కొరత ఏర్పడిందన్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో 29 లక్షల బోర్లు, రెండు జీవనదులు ఉన్నందున తెలంగాణ రైతాంగం అంతగా భయపడాల్సిన అవసరం లేదన్నారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవగాహన లేకుండా, పిచ్చి తుగ్లక్‌లా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని జితేంద్ర తీవ్రంగా విమర్శించారు. వాస్తవానికి రూ. 30,000 కోట్లతో గ్రావిటీ ద్వారా తుమ్మిడిహట్టి వద్దే ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశమున్నా, దాన్ని మార్చి రూ. 1,20000 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించారు. నాలుగు సంవత్సరాలలో ఈ ప్రాజెక్టు నుండి కేవలం 150 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోయగలిగారని, అందులో మళ్లీ 60 టీఎంసీల నీటిని శ్రీరామసాగర్ నుండి వదిలేయాల్సి వచ్చిందని గణాంకాలు చెప్పారు. అవగాహన లేని నిర్మాణం కారణంగానే ఈరోజు మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు కూడా బుంగలు పడి కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story