Big Story: ఉగ్ర*వాద మిత్ర దేశాలకు భారత్ వార్నింగ్!
Big Story: ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఆసియాన్ సమావేశంలో ఉగ్రవాదంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ప్రస్తావన.
Big Story: ఉగ్ర*వాద మిత్ర దేశాలకు భారత్ వార్నింగ్!
Big Story: ప్రపంచశాంతికి ఉగ్రవాదం పెనుముప్పుగా మారిందన్నారు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుదముట్టించాల్సిందేనన్నారు.ఫిలిప్పీన్స్ లోని సెబూలో జరిగిన ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా సరిహద్దుల్లో అనేక సవాళ్లను ఎదుర్కొన్న అనుభవంతో భారత్ ఉగ్రవాద వ్యతిరేక వ్యూహాలురూపొందించుకుందన్నారు.అంతేకాదు ప్రపంచపటంపై కొన్ని దేశాలు...ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. పరోక్షంగా పాకిస్తాన్ పై ఆయన విమర్శలు చేశారు. అయితే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.
ప్రధానంగా ఆసియా దేశాలకు సంబంధించి ప్రాంతీయ భద్రతను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి భారత్ కట్టుబడి ఉందన్నారు. ఉగ్రవాదంపై భారత్ నిరంతరం పోరాటం చేస్తూనే ఉందన్నారు.ఈ సందర్భంగా కిందటేడాది భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తావించారు.భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సూపర్ డూపర్ గా హిట్ అయిందన్నారు.ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పెద్ద సంఖ్యలో ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేసిందని ఆయన వెల్లడించారు. అంతేకాదు...ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే చర్యలపై భారత్ వైఖరిని ఆపరేషన్ సిందూర్ చాటిచెప్పిందన్నారు.అంతేకాదు...ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న ప్రతి వ్యూహం మంచి ఫలితాలు ఇస్తోందని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. సరిహద్దుల అవతలి నుంచి ఎదురయ్యే భద్రతా సవాళ్లను ఎదుర్కొంటూ భారత్ ఉగ్రవాద నిరోధక సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుందని ఆయన వెల్లడించారు.
ఉగ్రవాదాన్ని మూలాల నుంచి నిర్మూలించేందుకు ప్రాంతీయ దేశాలు సమన్వయంతో పనిచేయాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. ఉమ్మడి సైనిక విన్యాసాలు, సామర్థ్యాల పెంపు కార్యక్రమాలు, నిఘా సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం ద్వారా ఉగ్రవాద నిరోధక చర్యలను మరింత బలోపేతం చేయవచ్చన్నారు. ఇందులో భాగంగా ప్రాంతీయ దేశాలు తమ క్షేత్రస్థాయి అనుభవాలను ఇతర దేశాలతో పంచుకోవాలని ఆయన కోరారు. ఇలా చేయడం ద్వారా ఉమ్మడి భద్రతా సామర్థ్యాలను పెరుగుతాయని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కేవలం ఆకాంక్షలుగా మిగిలిపోరాదన్నారు. శాంతి, స్థిరత్వం అనేవి వాస్తవరూపం దాల్చాలని ఆయన కోరారు. ఇందుకు ప్రాంతీయ దేశాలు సమష్టిగా కృషి చేయాలని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.
ఆసియాన్ కేంద్ర స్థానాన్ని భారత్ ఎప్పుడూ గౌరవిస్తుందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇండో-పసిఫిక్ దార్శనికతకు ఆసియాన్‌మూలస్తంభమని ఆయన పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం సురక్షితంగా, పటిష్ఠంగా, సుసంపన్నంగా ఉండేందుకు ఆసియాన్ దేశాల
వేదిక కీలకమని ఆయన వివరించారు.
ఇదిలా ఉంటే,సభ్య దేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందించడం, కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడం, రక్షణ రంగంలో సహకారాన్ని విస్తరించడం వంటి అంశాలకు సంబంధించి ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం ఉపయోగపడుతుందని తాను భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించిన ఫిలిప్పీన్స్‌కు రాజ్‌నాథ్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు ఫిలిప్పీన్స్ దేశం అందించిన ఆతిథ్యాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆసియా-పసిఫిక్ ప్రాంత దేశాలతో ఆర్థిక సహకారం, సాంస్కృతిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడమే భారత్ 'యాక్ట్ ఈస్ట్' విధానం ప్రధాన లక్ష్యమన్నారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, బహుపాక్షిక వేదికల ద్వారా నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తూ ఈ సంబంధాలను బలోపేతం చేయడంపై భారత్ దృష్టి సారిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.




