Burning Topic: విజయ్ కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. ఉత్కంఠ కు శుభం కార్డు

Burning Topic: తమిళనాడులో విజయ్ ప్రభంజనం! టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 May 2026 6:56 AM IST
Burning Topic
X

Burning Topic: విజయ్ కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. ఉత్కంఠ కు శుభం కార్డు

Burning Topic: తమిళ రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. గంట గంటకూ ఉత్కంఠను రేపుతున్నాయి. మొత్తానికి టీవీకే సారథి విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా వీసీకే పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ నేత తిరుమావళవన్ లేఖ ఇచ్చారు. అలాగే ఐయూఎంల్‌ కూడా మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దీంతో సంఖ్యాబలం 120కి చేరింది. అయితే విజయ్‌‌కు వెంటనే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అపాయింట్మెంట్ దొరకలేదు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం ఆయన కేరళ వెళ్లాల్సి ఉంది. అయితే గవర్నర్ షెడ్యూల్ మార్చుకొని విజయ్‌కు అనుమతి ఇచ్చారు. దీంతో ఆయనకు తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యే జాబితాను అందించి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు కాగా ఒక దశలో డీఎంకే-అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసుందనే ప్రచారం కూడా జరిగింది. ఈ కూటమి సీఎం అభ్యర్థిగా తిరుమావళవన్‌ పేరును డీఎంకే తెర మీదకు తెచ్చిందంటున్నారు. అయితే ఈ ప్రతిపాదను అన్నాడీఎంకే వ్యతిరేకించిందని చెబుతున్నారు.

మరోవైపు అన్నాడీఎంకే నేత పళనిస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీకి అభినందనలు అంటూ చేసిన ప్రకటన కలకలం రేపింది. . తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్‌కు అవసరమైన మద్దతు లభించిందా? అనే కోణంలో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. విజయ్‌తో వీసీకే పొత్తు ఖాయమైందంటూ ప్రచారం జరిగింది. ఏ పార్టీ పేరునూ నేరుగా ప్రస్తావించకుండానే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న పార్టీకి పళనిస్వామి అభినందనలు తెలిపారు. అన్నా డీఎంకే తెరవెనుక నుంచి విజయ్‌కు అవసరమైన పూర్తి మద్దతు ఇచ్చిందననే వాదన కూడా ఉంది. అందుకే పళనిస్వామి ఈ తరహా వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు పుదుచ్చేరి శిబిరంలో ఉన్న అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు పళనిస్వామి నివాసానికి చేరుకున్నారు. అక్కడ ముఖ్యనేతలతో పళనిస్వామి కీలక చర్చలు జరిపారు

మరోవైపు టీవీకేకు ఏఎంఎంకే మద్దతు ఇచ్చినట్లు వస్తున్న వార్తలను ఆ పార్టీ అధినేత దినకరన్‌ తోసిపుచ్చారు. తమ ఎమ్మెల్యే మద్దతిస్తున్నారని పేర్కొంటూ గవర్నర్‌కు టీవీకే నేతలు జిరాక్స్‌ కాపీ ఇచ్చినట్లు తెలుస్తోందన్నారు. అయితే, అసలైన లేఖ ఎక్కడుందో బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. అది లభిస్తేనే వాస్తవాలు బయటపడతాయన్నారు. లేఖపై తాను సంతకం చేస్తున్నట్లు టీవీకే విడుదల చేసిన వీడియోపై ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్‌ స్పందిస్తూ.. అది కృత్రిమ మేధ ఆధారిత వీడియో అని ఆరోపించారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. కాగా తమిళనాడులో అన్నాడీఎంకేకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరారు దినకరన్. ప్రభుత్వ ఏర్పాటుకు మాజీ సీఎం పళనిస్వామిని ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల వెలువడిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏఎంఎంకే ఒక స్థానంలో గెలిచింది (MLA Kamaraj's letter)

మరోవైపు తాజా రాజకీయ పరిణామాల్లో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ తెరవెనుక ఎత్తుగడలు వేస్తున్నట్లు చెబుతున్నారు. జరుగుతున్న పరిణామాలకు గమనిస్తే డీఎంకే చాలా లోతైన రాజకీయ వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. తమ కూటమిలోని పార్టీలు ఒక్కొక్కటిగా టీవీకేకు మద్దతిచ్చేలా స్టాలిన్‌ పావులు కదిపారని అంటున్నారు. ఈ దిశగా ఆయన వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్‌ నేతలతో చర్చించారు.

అన్నా డీఎంకే ప్రభుత్వంలో చేరకుండా అడ్డుకునేందుకే స్టాలిన్ ఇదంతా చేస్తున్నారని ప్రచారం జరగుతోంది. ఎన్డీయేను అటు ప్రభుత్వంలోకి, ఇటు ప్రధాన ప్రతిపక్షంలోకి రాకుండా చెక్‌ పెట్టగలిగారు కూటమిలోని కాంగ్రెస్‌ తీరుతో ఓ వైపు అసంతృప్తితో ఉన్నప్పటికీ, మిగిలిన మిత్రపక్షాలను తెలివిగా టీవీకే వైపు ప్రయోగించింది డీఎంకే. అసెంబ్లీతో డీఎంకేను బలమైన ప్రతిపక్షంగా నిలపడం కోసం స్టాలిన్ వ్యూహ రచన చేశారని చెబుతున్నారు. ఈ పరిణామాలు అన్నా డీఎంకేకు మింగుడు పడటం లేదు

మరోవైపు విజయ్ నెంబర్‌గేమ్ విషయంలో తడబడటం చర్చనీయాంశంగా మారింది. పూర్తి మెజారిటీ రాకపోవడంతో చిన్న పార్టీల మద్దతు కూడగట్టడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ దిశగా ఏకంగా మూడు సార్లు గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలవడం, ఆయన తిరస్కరించడం ప్రత్యర్థులకు వినోదంగా మారింది. వాస్తవానికి అత్యధిక సీట్లు గెలిచిన వారిని ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్ పిలుస్తారు. కానీ విజయ్ మాత్రం. గవర్నర్ పిలవకుండానే తనంతటా తానుగా వెళ్ళి ప్రభుత్వ ఏర్పాటు గురించి అడిగాడు. ఇది రాజకీయంగా మొదటి తప్పటడుగు. పైగా కమ్యూనిస్టులు, ముస్లిం లీగ్ బహిరంగంగా మేము మద్దతు ఇవ్వము అని ప్రకటన చేయటం వారు చేసిన రాజకీయ తప్పిదం. విజయ్‌కు రాజకీయ అనుభవం లేకపోవడంతో ఇతర రాజకీయ పార్టీలు దీన్ని అవకాశంగా తీసుకుంటున్నాయి. క్లిష్టమైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో అనుభవజ్ఞులైన ఇతర నాయకుల స్థాయికి రావడానికి విజయ్ సమయం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story