Jordar Varthalu: పులి బొమ్మతో దొంగతనం.. ఏం తెలివిరా నాయనా

Jordar Varthalu: అనంతపురం జిల్లా పామిడిలో వింత దొంగతనం. పులి మాస్కు ధరించి కిరాణా షాపులో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి సిసిటివికి చిక్కాడు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 April 2026 1:22 PM IST
Jordar Varthalu
X

Jordar Varthalu: పులి బొమ్మతో దొంగతనం.. ఏం తెలివిరా నాయనా

Jordar Varthalu: సాధారణంగా దొంగలు ముఖానికి మాస్కులు లేదా గుడ్డలు కట్టుకుంటారు. కానీ, అనంతపురం జిల్లా పామిడిలో ఒక దొంగ పోలీసులకు దొరకకుండా ఉండేందుకు చిన్న పిల్లలు ఆడుకునే పులి మాస్కును ధరించి దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ దొంగ పెద్ద పెద్ద బ్యాంకులు లేదా బంగారు షాపులను కాకుండా, ఎవరికీ అనుమానం రాకుండా కిరాణా దుకాణాలను ఎంచుకున్నాడు. గత 15 రోజులుగా ఒకే దుకాణంలో నిరంతరం దొంగతనాలకు పాల్పడుతున్నాడు.

గల్లా పెట్టెలోని చిల్లర డబ్బులతో పాటు సబ్బులు, సర్పులు, షాంపూలు మరియు పంచదార వంటి నిత్యావసర సరుకులను ఎత్తుకెళ్తున్నాడు చిల్లర దొంగతనాలతో విసిగిపోయిన దుకాణ యజమాని సిసిటివి (CCTV) కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఈ పులి మాస్కు దొంగ బండారం బయటపడింది సోమవారం నాడు మళ్లీ దొంగతనానికి వచ్చి సరుకులు ఎత్తుకెళ్తుండగా కెమెరాకు చిక్కాడు. ప్రస్తుతం పోలీసులు ఈ వింత దొంగ కోసం గాలిస్తున్నారు.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story