Jordar News: విజయ్ అనగానే త్రిష ఎలా సిగ్గుపడుతుందో చూడండి

Jordar News: తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ ఘనవిజయం సాధించాక హీరోయిన్ త్రిష మరోసారి వార్తల్లో నిలిచారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 May 2026 7:15 AM IST
Jordar News
X

Jordar News: విజయ్ అనగానే త్రిష ఎలా సిగ్గుపడుతుందో చూడండి

Jordar News: ఎవ్వలన్న సుట్టాలు ఇంటికచ్చి పోతున్నప్పుడో.. లేదంటె, బాట మీద బాగ తెల్శినొల్లు కనవడ్డప్పుడో.. మీ నాన్నను అడిగనట్టు శెప్పు, మీ ఆయినెను అడిగినట్టు శెప్పు అని అంటుంటరు. అగో అచ్చం అసోంటి అన్భవమే ఎదురైంది సీఎం విజయ్ దోస్తు త్రిషకు చైన్నైల ఇయ్యల్ల. త్రిష కొత్త సీన్మా కురుప్పు విడ్దలయ్యింది గదా. టాకీస్కువొయ్యి సీన్మా సూశింది మేడం చెన్నైల. ఇగ సీన్మా సూశి పోతాంటె అభిమాన్లంత గుమిగూడిర్రు కారు సుట్టు. అప్పుడే ఒగ అభిమాని త్రిష మేడంతోటి గిట్లన్నడు.

ఇన్నరు గదా.. ఓ మీకు తమిళం రాదు గదా.. సీఎం విజయ్ సారును అడిగినట్టు శెప్పుమంటుంటున్నడుల్ల ఓ అభిమాని. అభిమాని అట్లనుడు ఆల్శం కొత్త పెండ్లి కూతురు లెక్క మస్తు సిగ్గు పడ్డది త్రిష మేడం. శిన్నగ స్మైలిచ్చి తల్కాయంచి ముశిముశి నవ్వులు నవ్వింది. ఇంటర్నెట్ల గీ వీడియో ఇప్పుడు మస్తు వైరల్ ఐతాంటె, వీడియోను సూస్కుంట కొద్ది సంబురపడ్తలేరు ఆల్ల అభిమాన్లు. మరిగ ఈల్ల దోస్తాను దోస్తాన్తోటి ఆగిపోతదా.. ఇంకేడికన్న దారి తీత్తదా.. సూడాలె పోను పోను.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story