Burning Topic: మళ్ళీ శాంతి ఒప్పందం అంటున్న ట్రంప్!
Burning Topic: ఇరాన్‌తో దాడులను నిలిపివేసి శాంతి చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Burning Topic: మళ్ళీ శాంతి ఒప్పందం అంటున్న ట్రంప్!
Burning Topic: హఠాత్తుగా అమెరికా అధ్యక్షుని మనసు ఎందుకు మారింది?. రెండు, మూడు రోజులుగా దాడులు నిలిపేసిన అమెరికా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. తాజాగా ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. పరస్పర దాడులను నిలిపివేయడంతో శాంతి చర్చల్లో పురోగతి సాధించే అవకాశాలు మెరుగుపడ్డాయని చెబుతున్నారు.
అదే సమయంలో ఇరాన్‌తో దౌత్య ప్రయత్నాలు విఫలమైతే తిరిగి సైనిక చర్యలకు దిగుతామని హెచ్చరించారు. అయితే ఇరాన్ మాత్రం అమెరికాతో ఎలాంటి చర్చలు ఉండబోవయని చెబుతోంది. మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి.
Next Story




