Burning Topic: అమెరికాకు దెబ్బ మీద దెబ్బ.. ట్రంప్ ప్రభుత్వం కులనుందా?

Burning Topic: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇరాన్‌లోని అతిపెద్ద వంతెనను కూల్చేసిన అమెరికా సైన్యం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 April 2026 7:53 AM IST
Burning Topic
X

Burning Topic: అమెరికాకు దెబ్బ మీద దెబ్బ.. ట్రంప్ ప్రభుత్వం కులనుందా? 

Burning Topic: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా ముసురుకున్నాయి. చర్చలకు రాకపోతే ఇరాన్‌ను 'రాతి యుగం'లోకి తీసుకెళ్తానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో, అగ్రరాజ్యం ఆ దేశంలోని మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులను ఉధృతం చేసింది. ఇరాన్ రాజధాని టెహరాన్‌ను కరాజ్‌తో అనుసంధానించే 136 మీటర్ల ఎత్తైన భారీ వంతెనను అమెరికా సైన్యం ధ్వంసం చేసింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను ట్రంప్ స్వయంగా తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పోస్ట్ చేస్తూ, "ఇది ఆరంభం మాత్రమే" అని పేర్కొన్నారు.

మరోవైపు యుద్ధం నడుస్తున్న తరుణంలోనే అమెరికా అధికార యంత్రాంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా సైన్యాధిపతి జనరల్ రాండీ జార్జ్‌ను పదవి నుంచి వైదొలగాలని రక్షణ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్ ఆదేశించడంతో ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. రక్షణ విభాగాన్ని పూర్తిగా పునరుద్ధరించే క్రమంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాండీ జార్జ్‌తో పాటు ఎఫ్బీఐ డైరెక్టర్ కాస్ పటేల్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ వంటి కీలక అధికారులపై కూడా వేటు పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story