News Analysis: పైసలు ఉన్నోడు కడతాడు.. లేనోడి పరిస్థితి ఏంటి? కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ విమర్శలు!

News Analysis: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నేరుగా విద్యార్థుల అకౌంట్లలో వేయాలన్న కాంగ్రెస్ నిర్ణయంపై బీఆర్ఎస్ నేత లక్ష్మీ నరసింహా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 26 Jun 2026 11:18 AM IST
News Analysis
X

News Analysis: పైసలు ఉన్నోడు కడతాడు.. లేనోడి పరిస్థితి ఏంటి? కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ విమర్శలు!

News Analysis: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చుట్టూ జరుగుతున్న రాజకీయ రచ్చ మరింత ముదురుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్ష్మీ నరసింహా రెడ్డి మండిపడ్డారు. హెచ్ఎంటీవీ (hmtv) డిబేట్‌లో పాల్గొన్న ఆయన, రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని ధ్వజమెత్తారు.

డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) పద్ధతిలో నేరుగా విద్యార్థుల అకౌంట్లలో డబ్బులు వేస్తామని, కాలేజీలు ఆ తర్వాత వసూలు చేసుకోవాలనే నిబంధనలపై లక్ష్మీ నరసింహా రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఉన్నట్లుగా నేరుగా కాలేజీల ఖాతాలకే ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుత విధానం వల్ల విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ విద్యార్థులు సకాలంలో ఫీజులు కట్టకపోతే ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు వారిని క్లాసుల బయట నిలబెట్టడం, హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు ఆపేయడం లాంటి ఇబ్బందులకు గురిచేస్తాయని గుర్తుచేశారు. "స్తోమత ఉన్నవారు ఎలాగోలా అప్పులు చేసి ఫీజులు కడతారు.. కానీ పైసలు లేని పేద విద్యార్థులు చదువు ఆపేసి ఇంట్లో కూర్చోవాలా?" అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story