Burning Topic: ట్రంప్ వల్లే తులసి రాజీనామా చేసారా?
Burning Topic: అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబార్డ్ తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు.
Burning Topic: ట్రంప్ వల్లే తులసి రాజీనామా చేసారా?
Burning Topic: ఇంతకీ తులసీ గబార్డ్ ఎందుకు రాజీనామా చేశారు? ఇరాన్‌తో యుద్ధం విషయంలో అధ్యక్షుడు ట్రంప్‌తో విబేధాలే కారణమా?. అధ్యక్ష భవనం తులసీని పక్కన పెట్టడానికి కారణం ఏంటి? కీలకమైన నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ పదవికి ఆమె రాజీనామా చేయడం అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్‌కు తొత్తుగా పనిచేస్తున్న అమెరికా ప్రభుత్వంలో మీలాంటి నిజాయితీ గల వ్యక్తులు పనిచేయడం విచారకరం అంటూ తులసీకి మద్దతుగా ఇరాన్ స్పందించింది. కాగా తులసీ గబార్డ్ అద్భుతంగా పనిచేశారు. మేం ఆమెను మిస్ అవుతాం అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
పశ్చిమాసియా యుద్ధం కీలక మలుపు తిరుగుతున్న సమయంలోనే అమెరికాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు తులసీ గబార్డ్. ఓవల్ ఆఫీస్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. తన రాజీనామా విషయాన్ని ఆన్‌లైన్ పంచుకున్నారు. ద్వారా పంచుకున్నారు. ఈ రాజీనామా జూన్ 30 నుంచి అమలులోకి వస్తుంది. తన భర్త అబ్రహాంకు అరుదైన రకమైన ఎముక క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, దగ్గరుండి చూసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాబోయే వారాలు, నెలల్లో ఆయన చికిత్స మరింత క్లిష్టంగా ఉండబోతోంది. కొన్ని చాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఈ పోరాటంలో ఆయన పక్కన ఉండేందుకే తాను ప్రజా సేవ నుంచి తప్పుకోవాల్సి వస్తోందని కారణాలను రాజీనామా లేఖతో స్పష్టం చేశారు. గత ఏడాదిన్నరగా తనపై ఉంచిన నమ్మకానికి విశ్వాసానికి అధ్యక్షుడు ట్రంప్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
తులసీ గబార్బ్ రాజీనామా అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. డొనాల్డ్ ట్రంప్‌నకు అత్యంత నమ్మకస్తురాలిగా ఆమెకు పేరుంది. ఇరాన్ మీద అమెరికా యుద్ధం చేపట్టిన సమయంలో తులసీ గబార్డ్ ఇచ్చిన నివేదిక డొనాల్డ్ ట్రంప్ వాదనకు భిన్నంగా ఉంది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందన్న సాకుతో అమెరికా దాడులకు దిగడం తెలిసిందే. అయితే ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోవడం లేదని, యుద్ధానికి ముందు కూడా ఆ దేశం ఎలాంటి అణు సుసంపన్నతకార్యక్రమాలను పునరుద్ధరించలేదని తులసీ తన నివేదికలో స్పష్టం చేశారు. దీంతో అధ్యక్షునికి, ఆమెకు మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరిగింది. కొంత కాలంగా అంతర్జాతీయ అంశాలపై వైట్‌హౌస్‌లో జరిగిన కీలక చర్చల నుంచి గబార్డ్‌ను దూరంగా ఉంచినట్లు చెబుతున్నారు. దీంతో ఆమెకు ప్రాధాన్యం తగ్గిందని, కీలక భద్రతా సమావేశాలకు కూడా పిలవలేదని వార్తలు వచ్చాయి.
కాగా తులసీ గబార్డ్ హిందూ అమెరికాన్. ఆమె పేరు చూడగానే తెలియని వారు భారతీయ నేపథ్యం ఉందని అనుకుంటారు. కానీ తులసీ గబార్డ్‌కు ఎలాంటి భారతీయ మూలాలు లేవు. ఆమె తండ్రి మైక్ గబ్బర్డ్ సమోవన్-యూరోపియన్ నేపథ్యానికి చెందిన వారు. తల్లి క్యారెల్ గబ్బార్డ్ అమెరికన్, అయితే తల్లికి హిందూ మతాన్ని అవలంభించారు. హిందూ ఆధ్యాత్మిక జీవనశైలిని అవలంభించడంతో పాటు తమ పిల్లలకు తులసి, భక్తి, జై, వృందావన్ వంటి పేర్లు పెట్టారు. తులసీ కూడా చిన్నప్పటి నుంచీ హిందూ మతాన్ని పాటిస్తూ భగవద్గీత, యోగా, వేద సాంప్రదాయాల మధ్య పెరిగారు. తులసీ కొంత కాలం సైన్యంలో కూడా పని చేశారు. 2013లో అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలిగా భగవద్గీత మీద ప్రమాణం చేయడం చర్చనీయాంశంగా మారింది. హిందూ విశ్వాసాలు పాటించే అమెరికన్ రాజకీయ నాయకురాలిగా ఓ గుర్తింపు ఏర్పడింది. తలసీ గబార్డ్ వివాహం కూడా హిందూ మతాచారాల ప్రకారం జరిగింది.




