Jordar News: నేల మీద కాదు.. నీటి లోపల సైకిల్ తొక్కుతున్నారు

Jordar News: ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో వినూత్న సాహసం! సముద్రం అడుగున సైకిల్ తొక్కుతూ వాటర్ స్పోర్ట్స్ బృందం ప్రచారం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Jun 2026 7:17 AM IST
Jordar News
X

Jordar News: నేల మీద కాదు.. నీటి లోపల సైకిల్ తొక్కుతున్నారు

Jordar News: అగో.. పర్శానే ఉన్నది గదా. ముంగటికి పొయ్యేది లేదు, ఎన్కకు తగ్గేదిలేదు. ఉన్నకాన్నే ఉండి నీళ్లల్ల సైకిల్ గమ్మతి తొక్కుతున్నడు గదా ఈ అన్న. సడక్ల మీద, గాలిల ఎవ్వలైనా సైకిల్ తొక్కుతరు కనీ., నీళ్లల్ల సైకిల్ తొక్కెటోల్లకే.. ఓ రేంజ్ ఉంటదని సూపెట్టిర్రు ఏపీ వాటర్ స్పోర్ట్స్ సంఘపోల్లు. సైకిల్ తొక్కుడు పానానికి ఎంత మంచిదో శెప్పెతందుకు, దున్యాల ఎవ్వలు జెయ్యని సాహసం జేశిర్రు ఈల్లు. ఏపీ వాటర్ స్పోర్ట్స్ సంఘం పెబ్బ బలరాం అన్న టీమోల్లు విశాఖపట్నంలున్న సముద్రం అడుక్కు, గాలిబుడ్లు, శాపసొంటి బట్టలు తొడుక్కొని డై కొట్టిర్రు. మీదికెల్లి సైకిల్లను నీళ్లల్లకు ఇడ్వంగనే.. వాటి మీద కూసొని తొక్కుడు తొక్కిర్రు. అవ్వి దూరమైతే పోలేదు కనీ., ఉన్నకాన్నే ఉండి, నీళ్లల్ల సుతం సైకిల్ తొక్కచ్చని సూపెట్టిర్రు. సైకిల్ల పతరాను దున్యాకు సూపెట్టెతందుకు దున్యా సైకిల్ల దినోత్సవం సందర్భంగ ఇప్పటిదాంక ఎవ్వలు జెయ్యని సాహసం జేశిర్రన్నట్టు.

సైకిల్ను జిమ్ముల కొవ్వు కరిగిచ్చే సాధనంగ గాకుంట.. మన దైనందిన జీవితంల భాగంగ మార్సుకోవాల్నని అంటున్నరు. దీంతోని ఇంధనం ఆదా అయి, పర్యావరణం పచ్చగుంటదని అట్లనే పానం సుతం మంచిగుంటదని అంటున్నరు. మరి ఈ అన్నోల్లు కొత్త తీర్ల జేశ్న ప్రశారాన్ని సూశి కొందరన్న మార్తరో సూడాలె. కనీ, సముద్రం లోపట గాలిసిలండర్లేసుకొని ఉత్తగ ఈతగొట్టుడే కష్టం అసొంటిది.. సైకిల్ తొక్కి మోటివేషన్ జేశిర్రంటే.. ఈల్లను ఎంత తారీఫ్ జేశ్నా తక్వే పోర్రి. జనాలూ.. పిట్రోల్ డీజిల్లు అగ్గిపిరమైతున్న యాల్ల, సైకిల్లను వాడుతె శాన్నే పైసలు మిగుల్తయ్. ఏమంటరుల్లా మరి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story