Jordar Varthalu: పెండ్లి కారును పండ్ల కారుగా మార్చేశారు
Jordar Varthalu: పెళ్లి కారు డెకరేషన్ అంటే అందరూ పూలతో చేస్తారు, కానీ ఈ వైరల్ వీడియోలో కారును రకరకాల పండ్లతో అలంకరించారు.
Jordar Varthalu: పెండ్లి కారును పండ్ల కారుగా మార్చేశారు
Jordar Varthalu: : పెండ్లి కారు ముచ్చట్లు శెప్పి పండ్లమ్ముకునేటొల్లను సూయించుతార్రనుకుంటె మీరు పప్పుల కాలేశినట్టే. మంచిగ సూడుర్రి.. పెండ్లికారును పూలు, పండ్లతోటి శేశిర్రుల్ల డెకరేషను. వారెవా.. మామూలుగ లేదు గదా. డైరెక్టరు రాఘవేంద్రరావు తీసిన సీన్మా పాటల రేంజిల ఉన్నది పొన్రి. అంగుర్లు, బత్తాయి పండ్లు, అనాసపండ్లు, ద్రాక్ష పండ్లు, సేపులు.. అబ్బో కారు మీద లేని పండు లేదు గదా. కారు మీద శిన్నపాటి పండ్ల మార్కేటే పెట్టిర్రు పోన్రి. ఇది ఎవ్వల పెండ్లో గని, కొత్త ట్రెండు అనుకుంట సోషల్ మడియాల వైరల్ ఐతాంది గీ వీడియో. పెండ్లి కారును సూశినొల్లంత డైరెక్టరు రాఘవేంద్రరావు తీశిన సీన్మాలను యాదికి తెచ్చుకుంటున్నరు. దర్శకుడు రాఘవేంద్రరావు ఇచ్చిన ఐడియా కావచ్చునని కామెంట్లు రాస్తున్నరు గుడ. ఇంకొందరేమో విల్వకల్ల పండ్లు వేస్టు జేశిర్రని కోప్పడవట్టిర్రు. సరే ఎవ్వల మాట ఎట్లున్నా.. ఎవ్వల ఆనందం ఆళ్లది. కాకపోతే ఇట్ల అలంకరణ జేశినప్పుడు కారుకు ఒగలను కావలి పెట్టకుంటె మాత్రం.. పెండ్లయ్యేలోపే గీ డెకరేషన్ పని గుడ ఐతది.. ఎందుకంటె ఎవ్వల పానమాగుతదుల్ల శెప్పుర్రి గిట్ల పండ్లు సూశినంక.. ఆ..




