Burning Topic: పేపర్ లీకేజీలను ఆపేందుకు కేంద్రం ప్రత్యేక బిల్లు!

Burning Topic: నీట్ సహా పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు, అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని తీసుకొస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 July 2026 6:56 AM IST
Burning Topic
X

Burning Topic: పేపర్ లీకేజీలను ఆపేందుకు కేంద్రం ప్రత్యేక బిల్లు!

Burning Topic: నీట్ సహా పలు పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు, అక్రమాలపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమైన వేళ కేంద్ర ప్రభుత్వం కీలక చట్టం తీసుకురాబోతోంది. లీకేజీలతో ఉద్యమించిన విద్యార్థిలోకాన్ని శాంతింపజేసేందుకు, లీకేజీ నేరగాళ్ల వెన్నులో వణుకుపుట్టేలా అత్యంత కఠిన శిక్షలు, అత్యధిక జరిమానాలతో నూతన చట్టానికి తుదిరూపునిచ్చి పేపర్‌ లీక్‌ నిరోధక బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

ఇది చట్టంగా రూపొందితే తప్పుచేసిన వారకి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, పది కోట్ల రూపాయల జరిమానా పడుతుంది. విద్యార్థులు, యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ బిల్లు నిదర్శనమని కేంద్రం చెబుతోంది.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story