Burning Topic: ట్రంప్ నెత్తిన బాంబు పేల్చిన అమెరికా
Burning Topic: అమెరికాలో ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాలను కోర్టు రద్దు చేసింది. ఈ రీఫండ్ ప్రక్రియ ద్వారా భారతీయ ఎగుమతిదారులకు లక్ష కోట్ల రూపాయల వరకు లాభం చేకూరనుంది.
Burning Topic: ట్రంప్ నెత్తిన బాంబు పేల్చిన అమెరికా
Burning Topic: అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచ దేశాలపై సుంకాల యుద్ధానికి దిగడం తెలిసిందే. ఈక్రమంలోనే 1977 నాటి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ పేరుతో మొదట భారత్ సహా 60 దేశాలపై వాణిజ్య సుంకాలను విధించారు. ఆ తర్వాత దాదాపు 180 కి పైగా దేశాలకు విస్తరించారు. భారీ సుంకాల భారం కారణంగా అనేక దేశాలు అమెరికా మార్కెట్‌కు వస్తు, ఉత్పత్తులను ఎగుమతి చేయలేని దుస్థితిని ఎదుర్కొన్నాయి. ఇక మన దేశం మీద మొదట 25 శాతం సుంకాలను విధించిన అమెరికా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే సాకుతో మరో 25 శాతం కలిపి 50 శాతానికి చేర్చింది. ఈ ఏకపక్ష సుంకాలతో భారత ఎగుమతి వర్గాలు తీవ్రంగా నష్టపోయాయి. ఆ క్లిష్ట పరిస్థితుల్లోనూ అమెరికాకు వస్త్ర ఉత్పత్తులు, దుస్తులు, ఇంజినీరింగ్ వస్తువులు, రసాయనాలు, రసాయన సంబంధిత ఉత్పత్తుల ఎగుమతులు కొనసాగాయి.
ఈ సుంకాల ద్వారా 2025 సెప్టెంబర్ నాటికి అమెరికా ఖజానాకు దాదాపు 159 బిలియన్ డాలర్ల ఆదాయం జమైంది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాల బాదుడు రాజ్యాంగ విరుద్ధమని 2026 ఫిబ్రవరి 20న అమెరికా సుప్రీంకోర్టే తీర్పు వెలువరించింది. దీంతో గతేడాది అదనంగా వసూలు చేసిన సుంకాలను రీఫండ్ చేసే ప్రక్రియను అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ మొదలుపెట్టింది.ట్రంప్ సుంకాల రీఫండ్ దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 20న కేప్ ఆన్‌లైన్ పోర్టల్ ప్రారంభమైంది. నాటి నుంచి ఇప్పటివరకు 56వేల మందికిపైగా అమెరికన్ దిగుమతిదారులు దరఖాస్తులు సమర్పించారు. వారంతా కలిసి దాదాపు రూ.11.87 లక్షల కోట్ల సుంకాల రీఫండ్‌ను కోరడం గమనార్హం. మొత్తంగా రూ.15.49 లక్షల కోట్ల సుంకాల రీఫండ్ కోసం అమెరికన్ దిగుమతిదారులు కేప్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని జీటీఆర్ఐ అంచనా వేసింది.
రాబోయే కొన్ని నెలల్లో ఈ దరఖాస్తులన్నీ పరిష్కరించాలని అమెరికా కస్టమ్స్ విభాగం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతీ దరఖాస్తు ఆమోదం పొందిన 60 నుంచి 90 రోజుల్లోగా రీఫండ్‌ను అమెరికన్ దిగుమతిదారుడి బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. కాగా అమెరికా తిరిగి చెల్లించే మొత్తాల్లో భారత్ ఎగుమతి దారులకు రూ.93వేల కోట్ల నుంచి రూ.1.12 లక్షల కోట్ల దాకా తిగిగొచ్చే అవకాశం ఉంది. ఇందులో వస్త్ర ఉత్పత్తులు, దుస్తుల రంగానికి రూ.37వేల కోట్లు.. ఇంజినీరింగ్ వస్తువుల రంగానికి రూ.37వేల కోట్లు.. రసాయనాలు - రసాయన ఉత్పత్తుల రంగానికి రూ.19వేల కోట్లు దాకా రీఫండ్ అయ్యే అవకాశం ఉంది. అయితే జీటీఆర్‌ఐ నివేదిక ప్రకారం, ట్రంప్ సుంకాల రీఫండ్‌ను పొందే చట్టపరమైన హక్కు భారత ఎగుమతి వర్గాలకు లేదు. ఈ రీఫండ్‌ను పొందే అర్హత కేవలం అమెరికాలోని దిగుమతిదారులకే ఉంది. ఒకవేళ ఈ టారిఫ్ రీఫండ్‌లో కనీస వాటాను పొందాలని భారత ఎగుమతి వర్గాలు భావిస్తే, అమెరికన్ దిగుమతిదారులతో వాణిజ్యపరమైన చర్చలు జరపాల్సి ఉంటుంది.
గతేడాది తమ నుంచి వస్తువులు, ఉత్పత్తులను కొన్న అమెరికా సంస్థతో భారత ఎగుమతిదారులు రిబేట్ షేరింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చు. అమెరికా ప్రభుత్వం నుంచి లభించబోయే సుంకాల రీఫండ్‌లో నిర్దిష్ట వాటాను పంచుకోవడానికి అమెరికాలోని దిగుమతిదారుడు, భారత్‌లోని ఎగుమతిదారుడు పరస్పర అవగాహనకు రావాల్సి ఉంటుంది. భారత ఎగుమతిదారులు ఈ రీఫండ్‌ను నగదు రూపంలో పొందొచ్చు. లేదంటే తాము తదుపరిగా సప్లై చేయబోయే సరుకుల ధరల విలువలో సర్దుబాటు చేసేలా అవగాహనకు రావచ్చు. అదనపు సుంకాల కారణంగా గతేడాది అమెరికాకు భారత ఎగుమతిదారులు సప్లై చేసిన వస్తు, ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఆ ధరల ప్రకారమే ఆనాడు భారత్, అమెరికా వ్యాపారుల మధ్య కాంట్రాక్టులు కుదిరాయి. ఆ ధరల ప్రాతిపదికనే ఇప్పుడు అదనపు సుంకాల రీఫండ్‌ను అమెరికా ప్రభుత్వం చేస్తోంది. గతేడాది సుంకాల భారాన్ని తామే భరిస్తూ డ్యూటీ పెయిడ్ ప్రాతిపదికన అమెరికాకు వస్తువులను పంపిన భారత ఎగుమతిదారులు, ఆ రీఫండ్‌లో వాటా ఇవ్వాలని కోరొచ్చు.




