BIG DEBATE: ఖమేనీ అంత్యక్రియల వేళ మళ్లీ యుద్ధం.. అమెరికా-ఇరాన్ మధ్య క్షిపణుల వర్షం!

BIG DEBATE: ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలు పూర్తికాకముందే అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది.

Arun Chilukuri
Published on: 9 July 2026 11:02 AM IST
BIG DEBATE: ఖమేనీ అంత్యక్రియల వేళ మళ్లీ యుద్ధం.. అమెరికా-ఇరాన్ మధ్య క్షిపణుల వర్షం!
X

BIG DEBATE: ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల ఘట్టం జూలై 9 వరకు కొనసాగుతుండగానే, మరోవైపు ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు మళ్లీ మొదలయ్యాయి. జూన్ 17న కుదిరిన శాంతి ఒప్పందం (MoU) ప్రకారం 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఉండాలి. అయితే, హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేసే విషయంలో ఇరు దేశాల మధ్య తీవ్ర అంగీకార లేమి ఏర్పడింది.

ఇరాన్ వాదన: హర్మూజ్ జలసంధి భద్రతా బాధ్యత తమదే కాబట్టి, ఆ మార్గం గుండా వెళ్లే ప్రతి నౌక తమకు సమాచారం ఇచ్చి, తాము చూపించిన రూట్ (ఇరాన్ వైపు) నుంచే వెళ్లాలని పట్టుబడుతోంది. భారత్‌కు చెందిన నౌకతో సహా పలు అంతర్జాతీయ నౌకలను హెచ్చరించి ఇరాన్ వెనక్కి పంపింది.

అమెరికా వాదన: జలసంధిలో ఇరాన్ ఏర్పాటు చేసిన సీ మైన్స్ (సముద్రపు బాంబులు) తొలగించడమే ఒప్పందం ఉద్దేశమని, అంతేకానీ అక్కడ నౌకలపై నియంత్రణ సాధించే హక్కు ఇరాన్‌కు లేదని అమెరికా వాదిస్తోంది. ఒమాన్‌కు దగ్గరగా ఉండే అంతర్జాతీయ రూట్ ద్వారా నౌకలు వెళ్లొచ్చని స్పష్టం చేస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story