Burning Topic: యుద్ధం ఆగిపోయింది.. ఊపిరి పీల్చుకోండి..!
Burning Topic: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ఆగిపోయిందా? డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై చేస్తున్న దాడుల విషయంలో కీలక ప్రకటన చేసింది.
Burning Topic: యుద్ధం ఆగిపోయింది.. ఊపిరి పీల్చుకోండి..!
Burning Topic: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఇరు దేశాల మధ్య విభేదాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిష్టంభనను తొలగించడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు ప్రధాన సైనిక ఎంపికలను పరిశీలిస్తున్నారని అమెరికా వర్గాలు వెల్లడించాయి. ఇందులో మొదటిది ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారమైన చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకోవడం. రెండోది.. హార్యూజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ సాధించడం. మూడోది.. అణు కేంద్రాలు, సైనిక స్థావరాలపై పరిమిత దాడులు చేయడం.ఇరాన్ చమురు శుద్ధి కర్మాగారాలు, ఎగుమతి కేంద్రాలపై క్షిపణి దాడులు చేసి ఆ దేశాన్ని ఆర్థికంగా కుప్పకూల్చాలని అమెరికా భావిస్తోంది. దీంతో వారు తమ అణు కార్యక్రమాల ను ఇతర ప్రాంతీయ పోరాటాలను కొనసాగించలేని చెబుతున్నారు. ఇరాన్ రేవుల నుండి ఏ నౌక బయటకు వెళ్లకుండా మరియు లోపలికి రాకుండా అమెరికా నౌకాదళాన్ని మోహరించడం ద్వారా యుద్ధం ప్రకటించకుం డానే శత్రువును లొంగదీసుకోవచ్చని అంటున్నారు.
కాగా అణ్వస్త్ర తయారీ ప్రణాళికలను వదులుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్‌కు ఇరాన్ అంగీకరించడం లేదు. తమ అణు, క్షిపణి సామర్థ్యాలను జాతీయ సంపద తరహాలో కాపాడుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ స్పష్టం చేశారు. హర్మూజ్‌పై తమ నియంత్రణ కొనసాగుతుందని, అందుకోసం కొత్త నిబంధనలు తీసుకొస్తామని తెలిపారు. పర్షియన్ గల్ఫ్‌కు వచ్చే అమెరికన్లను సముద్రంలో ముంచేస్తామని ఆయన హెచ్చరించారు. అమెరికాను ‘పెద్ద సైతాను’గా మొజ్తాబా అభివర్ణించారు. పర్షియన్ గల్ఫ్‌లో అమెరికన్లకు పనేంటని ప్రశ్నించారు. ‘‘అత్యాశ, దుర్బుద్ధితో వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే విదేశీయులకు.. పర్షియన్ గల్ఫ్‌లో నీటి అడుగున తప్ప మరెక్కడా స్థానం ఉండదు.కాగా చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో ఒకింత ఒత్తిడి ఎదుర్కొంటున్న డొనాల్డ్ ట్రంప్.. హర్మూజ్‌ను తిరిగి తెరిచేందుకు కొత్త ప్రణాళికను ప్రతిపాదించారు.
ఇక ఇరాన్ మీద యుద్ధం ప్రారంభించి 60 రోజులు అవుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కీలక ప్రకటన చేసింది. తాము యుద్ధంలో లేమంటూ అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ తెలిపారు. సైనిక చర్య కోసం కాంగ్రెస్ ఆమోదం పొందాల్సిన చట్టపరమైన గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం బాంబు దాడులు, కాల్పులు వంటి క్రియాశీలక సైనిక చర్యలేవీ జరగడం లేదు. ప్రస్తుతం మేము శాంతి స్థాపన కోసం ప్రయత్నిస్తున్నాం. చాలా సున్నితమైన చర్చలు జరుగుతున్న తరుణంలో ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుతగలడానికి నేను ఇష్టపడను. ఏం జరుగుతుందో వేచి చూడాలని జాన్సన్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికా ఇరాన్ మీద దాడులు ప్రారంభించారు. మార్చి 2న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్య గురించి కాంగ్రెస్‌కు సమాచారం అందించారు. కాంగ్రెస్ అనుమతి లేకపోతే 60 రోజుల తర్వాత యుద్ధాన్ని ముగించాల్సి ఉంటుంది.. ఈ నేపథ్యంలో అమెరికా ఈ ప్రకటన చేసిందని చెబుతున్నారు.
అమెరికా కాంగ్రెస్ అనుమతిని తప్పించుకునే విషయంలో ట్రంప్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఏప్రిల్ మొదటివారంలోనే ఇరాన్‌తో అమెరికా యుద్ధం ఆగిపోయిందని సెనెట్‌లో ప్రకటించింది. ఆ దేశంతో యుద్ధం 60 రోజులకు మించి కొనసాగనందున కాంగ్రెస్ అనుమతిని పొందాల్సిన అవసరం లేదని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టంచేశారు. దీనికి సంబంధించిన తీర్మానంపై సెనెట్‌లో ఓటింగ్ నిర్వహించగా 47 - 50 ఓట్లు వచ్చాయి. ఇరాన్‌పై సైనిక చర్య విషయంలో అమెరికా ప్రెసిడెంట్‌కే నిర్ణయాధికారం ఉండాలనే ప్రతిపాదనకు అనుకూలంగా అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన 49 మంది సభ్యులు ఓట్లు వేశారు. అయితే పశ్చిమాసియా నుంచి అమెరికా సైన్యాల్ని వెనక్కి పిలవాలనే ప్రతిపాదనకు అనుకూలంగా ఇద్దరు రిపబ్లికన్లు ఓట్లు వేశారుఇరాన్‌పై యుద్ధం వేళ తమకు ఏమాత్రం సహకరించని నాటో కూటమి దేశాలు స్పెయిన్, ఇటలీ నుంచి అమెరికా సైన్యాల్ని వెనక్కి పిలిపించే అంశాన్ని పరిశీలిస్తున్నానని ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు.
మరోవైపు తమ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై అమెరికా చేస్తున్న ప్రచారాన్ని ఇరాన్ తోసిపుచ్చింది. తమ నాయకుడు ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించింది. పుకార్లను వ్యాప్తి చేయడానికి పశ్చిమ దేశాలు ఇటువంటి ఎత్తుగడలను ఉపయోగిస్తాయని ఇరాన్ నాయకులు ఆరోపించారుకొంతమంది మా నాయకుడు, అయతొల్లా సయ్యద్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి గురించి అడుగుతున్నారు. ఆయన ఎందుకు హాజరుకావడం లేదు? ఆయన ఎందుకు ఆడియో, వీడియో సందేశం పంపడం లేదు? ఆయనను సందర్శించిన వారు ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడటం లేదు?' అని అడుగుతున్నారు. ఇదంతా శత్రువులు వేస్తున్న ఒక ఎత్తుగడ. ఈ ప్రశ్నలతో మమ్మల్ని ప్రతిస్పందించేలా ఒత్తిడి చేసి, తద్వారా లక్ష్యాలను సాధించాలని వారు కోరుకుంటున్నారు అంటూ వివరించారు ఇరాన్ అధికారులు. బాంబు దాడి జరిగిన భవనంలోనే మొజ్తబా ఖమేనీ ఉన్నారని, కానీ ఆయన ప్రాణాలతో బయటపడ్డారని కూడా వారు ధ్రువీకరించారు.




