Burning Topic: ప్రపంచానికి తలనొప్పిగా మారిన డోనాల్డ్ ట్రంప్?

Burning Topic: పశ్చిమాసియాలో 107 రోజుల యుద్ధానికి తెరపడింది! అమెరికా-ఇరాన్ మధ్య చరిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 Jun 2026 6:22 AM IST
Burning Topic
X

Burning Topic: ప్రపంచానికి తలనొప్పిగా మారిన డోనాల్డ్ ట్రంప్?

Burning Topic: ఇల్లు అలకగానే పండుగ పూర్తయినట్లు కాదు.. వారాల తరబడి సాగిన పశ్చమాసియా యుద్ధం ముగిసినట్లు ప్రకటించినా అనేక ప్రశ్నలకు సమాధాలు దొరకలేదు. ముఖ‌్యంగా యుద్ధానికి దిగిన అమెరికా ఇరాన్‌కు తీవ్రంగా నష్టపరచినా, పెద్దగా సాధించిందేమీ లేదు. అయితే అమెరికాను గట్టిగా ఎదుర్కోవడం ద్వారా ప్రపంచానికి సత్తాను చూపించింది ఇరాన్. ఈ దేశం దగ్గర ఇంకా యురేనియం, క్షిపణులు, డ్రోన్ల నిల్వలు ఉన్నాయి. ఎవరికీ ఇష్టంలేని యుద్ధం కారణంగా గల్ఫ్‌లోని అమెరికా మిత్ర దేశాలు చాలా నష్టపోయాయి. మరోవైపు ఇరాన్ ఫ్రాక్సీల ముప్పు పొలగిపోకుండానే అమెరికా ఇప్పందం చేసుకోవడంపై ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తితో ఉంది.

పశ్చిమాసియాలో దాదాపు 107 రోజులుగా కొనసాగిన సంక్షోభానికి తెరపడింది. యుద్ధాన్ని ముగిస్తూ చరిత్రాత్మక శాంతి ఒప్పందం కోసం ముందుకొచ్చాయి అమెరికా, ఇరాన్. జూన్‌ 19వ తేదీన శాంతి ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నట్లు రెండు దేశాలూ ప్రకటించాయి. శాంతి ఒప్పందంలో ఏఏ వివరాలను ఉన్నాయనేది ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఇరాన్‌తో ఒప్పందంపై ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్‌సోషల్‌లో ఒక పలు పోస్ట్‌లు పెట్టారు. ‘ఇకపై ఎలాంటి సుంకాల్లేకుండా హర్మూజ్‌ జలసంధి తెరుచుకోబోతుంది. అమెరికా నావికాదళ దిగ్బంధాన్ని ఎత్తేస్తున్నాం.. ఇరువైపులా చమురు నౌకల రాకపోకలు ఆరంభమవుతాయి. ప్రపంచ నౌకలకు ఇదే నా పిలుపు. ఇంజిన్లు స్టార్ట్‌ చేయండి.. చమురు సరఫరాను సముద్రమార్గంలో ఉరకలెత్తించండి అంటూ ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు.

శాంతి ఒప్పందం సరే.. మరి ఇన్ని రోజులు ఇరాన్‌తో యుద్ధం పాధించి డొనాల్డ్ ట్రంప్ ఏం సాధించారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇరాన్‌ ఎన్నటికీ అణ్వస్త్రాలను దక్కించుకోకుండా అడ్డుకుంటామని, ఆ దేశ క్షిపణి కార్యక్రమాలను తుడిచిపెట్టేయడం ప్రధాన లక్ష్యాలని అనేక మార్లు చెప్పిన అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు ఎలాంటి నిర్దిష్ట హామీ రాకుండానే శాంతి ఒప్పందానికి సిద్ధపడ్డారు. కానీ వాస్తవాలు వేరుగా ఉన్నాయి. ఇరాన్ దగ్గర శుద్ధి చేసిన యురేనియం అలాగే ఉంది. దానివద్ద క్షిపణి, డ్రోన్ నిల్వలు కూడా చాలానే ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో ఇరాన్ చాలా వరకూ కుదేలైంది. యుద్ధం తొలిరోజే సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీని కోల్పోయింది. ఎందరో సీనియర్ నాయకులు, అధికారాలు మరణించినా గట్టిగా పోరాడింది ఇరాన్. తమ దేశంపై ప్రభుత్వం నియంత్రణ కూడా కోల్పోలేదు.

వాస్తవానికి యుద్ధానికి ముందు హర్మూజ్ జలసంధి తెరిచే ఉంది, అమెరికా కొత్తగా తెరిపింది ఏమీ లేదు. అయినా గొప్ప గెలుపుగా అమెరికా అధ్యక్షుడు చాటుకోవడం విచిత్రంగానే ఉంది. ఇరాన్ నౌకాదళాన్ని చాలావరకు ధ్వంసం చేయగలిగినా, స్పీడ్‌బోట్లతో హర్మూజ్‌ను నియంత్రించింది. హర్మూజ్‌ జలసంధిపై తనకున్న పట్టును చాటుకోవడం ద్వారా చమురు రవాణాలు అడ్డుకోవడం ద్వారా ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇరాన్ హిజ్బుల్లాలు, హౌతీలకు మద్దతివ్వకుండా ఆపడంలో విఫలమైంది అమెరికా. యుద్ధానికి ముందే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా మరింతగా పతనమైంది. అయినప్పటికీ ఇరాన్ తమ స్థైర్యాన్ని కోల్పోలేదు. ఇరాన్‌లో ఏర్పడ్డ సుదీర్ఘ వివాదం వల్ల అమెరికా తన సైనిక, ఆర్థిక వనరులను ఇతర ప్రధాన భౌగోళిక రాజకీయ సవాళ్ల నుంచి పశ్చిమాసియా వైపు మళ్లించాల్సి వచ్చింది.

ఒకవేళ ఇరాన్ తుది అణు ఒప్పందానికి రాకపోతే, టెహ్రాన్‌పై సైనిక దాడులను తిరిగి ప్రారంభిస్తానని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అంటే ఇంకా సంక్షోభం ముగిసిపోయినట్లు కాదు ఇరాన్‌కు చెందిన స్తంభింపజేసిన 12 బిలియన్ డాలర్ల ఆస్తులను విడుదల చేయడంతో పాటు, మరో 12 బిలియన్ డాలర్లను అందజేయడం, చమురు, ఇంధన పరిశ్రమలపై ఆంక్షలను నిలిపివేయడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. మరోవైపు అమెరికాతో ఒప్పందం విషయంలో ఇరాన్ దేశంలోనూ అసంతృప్తి కనిపిస్తోంది. ఈ శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఇరాన్‌లోని కఠినవాదులు, ప్రభుత్వ అనుకూల శక్తులు మషద్ వంటి నగరాల్లో రాయితీలు ఇచ్చే రాజీపరులకు మరణం అంటూ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా-ఇరాన్ అగ్రనేతల మధ్య జరగబోయే ఈ అత్యున్నత స్థాయి సమావేశంపై ప్రపంచ దేశాల దృష్టి నిలిచింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story