Burning Topic: నా షరతులకు ఒప్పుకుంటే యుద్ధం ఆపేస్తా?
Burning Topic: అమెరికా-ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా సంచలన మలుపు. తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను వదులుకోవడానికి ఇరాన్ అంగీకారం.
Burning Topic: నా షరతులకు ఒప్పుకుంటే యుద్ధం ఆపేస్తా?
Burning Topic: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల ముగింపు దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఇరు దేశాల మధ్య శాంతి కోసం జరుగుతున్న ముమ్మర దౌత్య ప్రయత్నాలు చివరి దశకు వస్తు్న్నాయి. తమ దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియంను వదులుకోవడానికి ఇరాన్ అంగీకరించింది. ప్రతిగా తమ ఓడరేవుల ముట్టడిని ఎత్తివేయడంతోపాటు విదేశాల్లో స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. కాగా ఒప్పంగం విషయంలో అప్పుడే తొందర పడాల్సిన అవసరం లేదంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అయితే తుది ఒప్పందంపై సంతకాలు జరిగే వరకూ ఇరాన్ మీద తమ దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు.
పశ్చిమాసియాను నెలల తరబడి అతలాకుతలం చేస్తూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన అమెరికా-ఇరాన్ యుద్ధం ఇక ముగిసిపోవడం ఖాయని స్పష్టమవుతోంది. ఇరు దేశాల మధ్య శాంతి కోసం అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ముమ్మర దౌత్య ప్రయత్నాలు చివరి దశకు వస్తు్న్నాయి. ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శాశ్వత కాల్పుల విరమణకు సంబంధించి 10 షరతులతో కూడిన తుది ముసాయిదా ఒప్పందం సిద్ధమైందని, దీనిపై ఇరు దేశాలు సంతకాలు చేయడానికి అంగీకరించాయని సమాచారం. తమ దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియంను వదులుకోవడానికి ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ అంశమే ఇప్పటి వరకు ఇరుదేశాల చర్చల్లో పెద్ద అడ్డంకిగా ఉంది. అయితే ఇందకు ప్రతిగా అయితే తమ ఓడరేవుల ముట్టడిని ఎత్తివేయడంతోపాటు విదేశాల్లో స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయాలని టెహ్రాన్ డిమాండ్ చేస్తోంది.
యురేనియాన్ని వదులుకునే విషయమై వెనక్కితగ్గకపోతే మళ్లీ దాడులు తప్పవన్న డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంతో పట్టుదలకు పోవద్దని ఇరాన్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. కాగా యురేనియం నిల్వలను ఏం చేయాలనే విషయమై మున్ముందు మరిన్ని చర్చలు జరగనున్నాయి. అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. శాంతి ఒప్పందంపై చర్చలు సానుకూలంగా సాగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై స్పందిస్తూ.. తమపై బలవంతంగా రుద్దిన యుద్ధానికి ముగింపు పలకడమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ తెలిపారు. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు అమెరికాతో అవగాహనా ఒప్పందాన్ని చేసుకునే పనిలో ఉన్నట్లు వెల్లడించారు. లెబనాన్‌తోసహా అన్ని యుద్ధాలను పూర్తిగా ముగించడంపైనే చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు.
పశ్చిమాసియాలో యుద్ధం ముగించే విషయంలో ఒప్పందంపై 30 నుంచి 60 రోజుల్లో చర్చలు జరుగుతాయని చెబుతున్నారు. మొదట ప్రాథమిక ఒప్పందం చేసుకొని ఆ తర్వాత 60 రోజుల్లో తుది ఒప్పందానికి వస్తామని ఇరాన్ అంటోంది. కాగా యుద్ధాన్ని ముగించడంతో పాటు వాణిజ్య నౌకల రవాణా కోసం హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవడంపై ఇరాన్‌తో జరుపుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించామని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే కొన్ని గంటల్లోనే శుభవార్త వచ్చే అవకాశం ఉందని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై ప్రకటన చేసే చాన్స్ ఉందని తెలిపారు. ముసాయిదాపై జరిగిన చర్చల్లో పురోగతి కనిపించిందని రూబియో అన్నారు. అయితే ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని కలిగి ఉండకూడదనేదే మా అంతిమ లక్ష్యం’ అని స్పష్టం చేశారు.
పశ్చిమాసియాలో ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ ప్రత్యక్ష సంఘర్షణల్లో ఇరు పక్షాలకూ భారీ ప్రాణ, ఆస్తి, సైనిక నష్టం జరిగింది. ఇరాన్ తన సుప్రీం నాయకుడు అలీ ఖమేనీతో పాటు పలువురు నాయకులతో పాటు 750 మందికి పైగా ప్రాణాలను కోల్పోయింది. ఈ యుద్ధంతో ఇరాన్ చమురు ఎగుమతులు దెబ్బతిన్నాయి. దాదాపు 33 మిస్సైల్ సైట్లు, చమురు క్షేత్రాలు, కీలక ప్రభుత్వ స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దేశ మౌలిక వసతులకు, ఆర్ధిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇరాన్ మీద యుద్దం కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై రూ. 53 లక్షల కోట్ల నుండి 84 లక్షల కోట్ల రూపాయల వరకు ప్రభావం పడినట్లు అంచనా. అమెరికాకు చెందిని 15 మంది సైనికులు మరణించగా, 538 మందికి సిబ్బంది గాయపడ్డారు. ఖతార్, సౌదీ అరేబియా తదితర ప్రాంతాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది. ఈ దాడుల్లో F-35A ఫైటర్ జెట్లతో సహా దాదాపు 42 అమెరికా సైనిక విమానాలు, రీపర్ డ్రోన్లు ధ్వంసమయ్యాయి.




