News Analysis: కాంగ్రెస్ మైండ్‌సెట్ మారలేదు.. hmtv ఎనాలసిస్‌లో బీజేపీ నేత హాట్ కామెంట్స్

News Analysis: వందేమాతరం గేయంలో కేవలం రెండు చరణాలు మాత్రమే పాడతామన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై బీజేపీ నేత అల్లాపూర్ శ్రీనివాస్ మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 20 Aug 2026 12:53 PM IST
News Analysis
X

News Analysis: కాంగ్రెస్ మైండ్‌సెట్ మారలేదు.. hmtv ఎనాలసిస్‌లో బీజేపీ నేత హాట్ కామెంట్స్

News Analysis: జాతీయ గేయం ‘వందేమాతరం’లోని మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపిస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయడంపై భారతీయ జనతా పార్టీ (BJP) నాయకుడు అల్జాపూర్‌ శ్రీనివాస్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హెచ్‌ఎమ్‌టీవీ (hmtv) నిర్వహించిన ప్రత్యేక న్యూస్ ఎనాలసిస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు.

కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచీ ఒక స్వార్థపూరిత, అహంకారపూరిత మైండ్‌సెట్ ఉందనడానికి ఈ నిర్ణయమే నిదర్శనమని అల్లాపూర్ శ్రీనివాస్ విమర్శించారు. "మేము చెప్పిందే వేదం.. మేము అనుకున్నదే దేశం వినాలి, అమలు జరగాలి" అనే భావనలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారని మండిపడ్డారు. పవర్ లోకి వచ్చినా లేదా పవర్‌లో లేకపోయినా ప్రజల ఆకాంక్షలను, దేశ హితాన్ని పక్కనపెట్టి వ్యవహరించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story