Big Debate: పేపర్ లీకేజీలపై కాంగ్రెస్ నిప్పులు: కేంద్రానికి వెంకట్ నాయక్ హెచ్చరిక!

Big Debate: ప్రశ్నాపత్రాల లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెంకట్ నాయక్ హెచ్చరించారు.

Arun Chilukuri
Published on: 29 July 2026 11:07 AM IST
Big Debate
X

Big Debate: పేపర్ లీకేజీలపై కాంగ్రెస్ నిప్పులు: కేంద్రానికి వెంకట్ నాయక్ హెచ్చరిక!

Big Debate: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న పోటీ పరీక్షల పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలోని లోపాలపై కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెంకట్ నాయక్ హెచ్చరించారు. హెచ్‌ఎమ్‌టీవీ (hmtv) నిర్వహించిన 'బిగ్ డిబేట్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కేంద్ర ప్రభుత్వం మరియు బిజెపి వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి మార్పు లేదా చట్ట సవరణలు తీసుకురావడం మాత్రమే సరిపోదని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న వ్యవస్థాగత లోపాలను పునాదులతో సహా సరిదిద్దాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.

నీట్ (NEET) ప్రవేశ పరీక్షల లీకేజీ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ దాదాపు 101 కీలక సిఫార్సులను సమర్పించిన విషయాన్ని వెంకట్ నాయక్ ప్రస్తావించారు. "కమిటీ స్పష్టంగా రాష్ట్రాలను సంప్రదించి ముందుకు వెళ్లాలని సూచించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రాలతో చర్చించలేదు. కమిటీ ఇచ్చిన రికమండేషన్లను అమలు చేయడానికి ప్రభుత్వం ఏమైనా ముందడుగు వేసిందా?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story