Jordar News: బీహార్ లో ట్రాఫిక్ ఆపినందుకు .. ఏం చేశారో చూడండి

Jordar News: బీహార్‌లోని ఈస్ట్ చంపారన్ జిల్లా మోతీహరిలో వీఐపీ సంస్కృతిపై సామాన్య జనం తిరగబడ్డారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 24 May 2026 7:45 AM IST
Jordar News
X

Jordar News: బీహార్ లో ట్రాఫిక్ ఆపినందుకు .. ఏం చేశారో చూడండి

Jordar News: సర్కార్లు ఏం జేశ్నా జనం భరించినంత వరకేనుల్లా. ఒక్కసారి వాళ్లకు ఓప్కె నశించిందా.. అటు సర్కార్ పెద్దలున్నా.. పోలీస్ ఫోర్సులున్నా.. శిన్నవోవాల్శిందే. అసొంటి పనే జేశిర్రు బీహార్ రాష్ట్రం ఈస్ట్ చంపారన్ జిల్లా మోతిహారి కాడి జనాలు. అసలు ముచ్చటేందంటే.. అటు దిక్కు ఎవలో బుగ్గకార్లపోతున్నరని, కిలోమీటర్ల కమానం దూరం కామన్ పబ్లికును ఎర్రటి ఎండల నిలవెట్టిర్రట. వీఐపీలు ఏన్నో ఉంటే.. సిగ్నల్ కాడున్నోల్లను పోనియ్యకుంట ఎటోల్లనటే ఆపిర్రట. ఎంతకు ఇడ్శిపెడ్తలేరట. ఇగత్తరు అగత్తరు. అని సీఎం గాలిమోటరెక్కి పోతుంటే.. కింద ట్రాఫిక్ ఆపినంత పన్జేశిర్రట. ఇగక్కడ ట్రాఫిక్లున్నోల్లకు ఓప్కె నశించింది. కట్టలు తెగిన ఆవేశంతోని హారన్లు కొట్టిర్రు. అయినా.. కద్లలేదు. ఇగ ఇట్లైతె ఇనరని, బారీకేడ్లను పక్కకు నూకి ఎవ్వల తొవ్వల ఆల్లు పోయిర్రు. ఇగ ఇంత మంది ఒక్కటేపారి అచ్చెటాలకు చేశేదేంలేక పోలీసోల్లు సుతం శేతులెత్తేశిర్రు. ఎవలో అచ్చుడేంది. వాళ్ల కోసం మేం ఆగుడేంది. ఈ జెన్ జీ జమానాల సుతం, పాత కాలపు పద్దతులే అంటె ఎట్లనుల్లా. ఫోన్ కట్కల మీద పనులైపోతున్న ఈ కంప్యూటర్ కాలంల, సర్కార్ నడ్పెటోల్ల కోసం, వాళ్ల ఇంట్లోల్ల కోసం, జనాలను పర్శాన్ పట్టిచ్చుడు ఎంత వరకు కరెక్టని తిట్టుకుంట ఇండ్లకు పోయిర్రు అటు దిక్కు పబ్లిక్కు. ఇగీ వీడియో ఇంటర్నెట్ల ఇర్గమర్గ వైరలయ్యెటాలకు సీజేపీ మేనిఫెస్టోల ఇంకోటి జమైందని అనుకోవట్టిర్రు నవయువ ఓటర్లు. పెర్గుట విరుగుట కొరకే అన్నట్టు.. రేపు రేపు అంతట ఇట్లనే జనాలు తిర్గవడ్డా పర్శానయ్యేదేంలేదు పోర్రి. మరి ఇప్పటికన్న సర్కార్లు తేరుకొని ఇసొంటి ఉద్దెర పనులకు మంగళం పాడ్తయో.. లేకుంటే.. పాతకాలపు పద్దతులనే పాటించి, జెన్ జీ ఆగ్రహానికి బలైతయో సూడాలె మరి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story